Seasonal Diseases | సీజనల్ వ్యాధుల వ్యాప్తి పరంగా, 2024లో తెలంగాణ అత్యంత దారుణమైన సంవత్సరంగా రికార్డులకెక్కింది. గతంలో ఎప్పుడూ చూడని స్థాయిలో డెంగ్యూ పాజిటివ్ కేసులు, అనుమానిత చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) వద్ద అందుబాటులో ఉన్న సీజనల్ వ్యాధుల డేటా ఆధారంగా, మొదటిసారిగా, తెలంగాణలో మొత్తం 13,592 అనుమానిత చికున్‌గున్యా కేసులు, 10,077 డెంగ్యూ ధృవీకరించబడిన కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో 13,592 అనుమానిత చికున్‌గున్యా కేసులు నమోదవడం చాలా ఆందోళన కలిగించే విషయం. కీళ్లను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ వైరస్ వ్యాధి, ప్రతి సంవత్సరం జూన్ నుండి డిసెంబర్ వరకు డెంగ్యూకు రెండవ స్థానంలో ఉంటుంది.
తెలంగాణలో అనుమానిత చికున్‌గున్యా కేసులు ఇంత పెద్ద సంఖ్యలో నమోదవడం ఇదే మొదటిసారి. 2018 నుంచి 2024 మధ్య, 2022లో ఒక్కసారి మాత్రమే తెలంగాణలో దాదాపు 6000 అనుమానిత చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి.
2024 లో సీజనల్ వ్యాధుల (Seasonal Diseases in Telangana) లో గణనీయమైన పెరుగుదల భవిష్యత్తులో నివారణ, నిఘా చర్యలకు మార్గనిర్దేశం చేయాలని హైదరాబాద్‌లోని సీనియర్ సీజనల్ వ్యాధుల నిపుణులు సూచించారు. అనుమానిత కేసులు పెద్ద సంఖ్యలో ఉండటం ప్రజారోగ్యంపై ప్రమాద హెచ్చరికలను సూచిస్తుందని.. సాధారణ ప్రజలపై, వైద్య మౌలిక సదుపాయాలపై భారాన్ని పెంచుతుందని వారు తెలిపారు.
సీజనల్ వ్యాధులు భారీగా పెరగడం వల్ల, జనవరి 2024, జనవరి 2025 మధ్య కాలంలో దక్షిణ భారత రాష్ట్రాలన్నింటిలో తెలంగాణ, డెంగ్యూ నిర్ధారించబడిన కేసులు, అనుమానిత చికున్‌గున్యా కేసులను గరిష్టంగా నమోదవడంలో కర్ణాటక తర్వాత తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది.
Seasonal Diseases :
తెలంగాణలో చికున్‌గున్యా కేసులు
- 2024 సంవత్సరంలో 13,592 కేసులు
- 2023లో 761 కేసులు
- 2022లో 6608 కేసులు
- 2021లో 220 కేసులు
- 2020 లో 364 కేసులు
- 2019 లో 5352 కేసులు
- 2018 లో 1954 కేసులు
డెంగ్యూ
- 2024 లో 10, 077 కేసులు
- 2023: (8016);
- 2022 (8972);
- 2021 (7135);
- 2020 (2173);
- 2019 (13331)
తమిళనాడు: 2020 (14 61); 2021 (3654); 2022 (4365); 2023 (4805); 2024 (3091).
కేరళ: 2020 (2302); 2021 (3030); 2022 (1511); 2023 (1099); 2024 (889).
కర్ణాటక : 2020 (16, 111); 2021 (40, 134); 2022 (65, 340); 2023 (72, 662); 2024 (77, 592).
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








