Summer Camp :హైదరాబాద్ (Hyderabad)లో వేసవి సెలవుల సందడి (holiday season has begun) మొదలైంది. పిల్లలందరూ (children) సెలవుల్లో ఎక్కడికైనా వెళదాం, కొత్తగా నేర్చుకుందామనే ఉత్సాహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి జూపార్క్ (Nehru Zoological Park) అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. అడవిని, జంతువులను ప్రేమించే పిల్లల కోసం వేసవి శిబిరాన్ని(special summer camp) ప్రారంభించనుంది. ఈ ప్రత్యేకమైన శిక్షణా శిబిరం మే నుంచి జూన్ వరకు జరగనుంది. ఈ క్యాంప్ ద్వారా విద్యార్థులు వన్యప్రాణుల (wildlife) జీవనాన్ని దగ్గరగా గమనించొచ్చు. కొత్తగా ఇంకెన్నో నేర్చుకోవచ్చు. చిన్నారులను సహజసిద్ధమైన పరిసరాలతో మమేకం చేసేలా, ప్రకృతిని, జంతువులను ప్రేమించేలా తీర్చిదిద్దే అవకాశమిది.
Summer Camp : మరెన్నో విశేషాలు
- కాల వ్యవధి : మే మొదటి వారం నుంచి జూన్ చివరి వరకు
- ప్రతి రోజు : 15 నుంచి 20 మంది విద్యార్థులకు ప్రత్యేక బ్యాచ్‌లు (Special batches)
- పాల్గొనదిగిన విద్యార్థులు : ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు మాత్రమే
- రిస్ట్రేషన్ ఫీజు (Registration Fee): రూ. 1000 క్యాంప్‌లో ఏమేం నేర్చుకోవచ్చు?
ఈ శిక్షణా శిబిరం పిల్లలకు సరదా అనిపించడమే కాకుండా, విలువైన విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది.
- నిర్దేశిత జూ టూర్స్: జంతువులను సజీవంగా చూసే అవకాశం లభిస్తుంది. వాటి జీవనశైలి, ఆహారం, అలవాట్లు వంటి అంశాలను నిపుణుల ద్వారా నేర్చుకునే అవకాశం ఉంటుంది.
- సర్పాలపై అవగాహన సెషన్లు: పాముల మీద మనకు ఎన్నో అపోహలుంటాయి. ఈ క్యాంప్ ద్వారా పాముల జీవన విధానం, వాటి పట్ల భయం ఎందుకు అవసరం లేదో తెలియజేస్తారు.
- నైట్ హౌస్ సందర్శన: పగలంతా నిద్రపోయే, రాత్రిపూట యాక్టివ్‌గా ఉండే జంతువులను ప్రత్యేకంగా రాత్రిపూట చూసే అవకాశం లభిస్తుంది. ఇది పిల్లలకు అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. క్యాంప్ కిట్‌లో ఏమేం ఉంటుంది? విద్యార్థులకు ప్రత్యేకంగా క్యాంప్ కిట్ అందించనున్నారు. NZP బ్యాడ్జ్, క్యాప్, నోట్‌ప్యాడ్, రోజూ స్నాక్స్, వెజిటేరియన్ భోజనం కల్పిస్తారు. Summer Camp : రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?

తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ వేసవి శిబిరానికి ఇలా నమోదు చేసుకోచ్చు:
- ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు: అధికారిక వెబ్‌సైట్ ద్వారా పర్సనల్ డిటెయిల్స్, క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాలి.
- హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్ చేయండి : 040-24477355
 -వాట్సాప్ ద్వారా కూడా సమాచారం : 9281007836
ఈ క్యాంపు రోజూ బ్యాచ్‌ల వారీగా ఉంటుంది. పరిమిత సంఖ్యలోనే విద్యార్థులను అంగీకరిస్తారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికే అవకాశం ఉంటుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    