గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) రాజీనామాను బిజెపి హైకమాండ్ ఆమోదించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయన తెలంగాణ బిజెపిని బహిరంగంగా విమర్శించారు. తెలంగాణ బిజెపిలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తన రాజీనామా లేఖను బిజెపి హైకమాండ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాను ఒక వారం తర్వాత పార్టీ అధిష్ఠానం ఆమోదించింది. దీనిని జూలై 11, 2025న బిజెపి జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు.
బీజేపీపీ నాయకుడు, గోషామహల్ (Goshamahal ) ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆమోదించారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ శుక్రవారం (జూలై 11) అధికారిక లేఖను విడుదల చేసింది. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజా సింగ్ ఇటీవల తన రాజీనామా లేఖను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమర్పించారు. కిషన్ రెడ్డి ఆ లేఖను పార్టీ హైకమాండ్‌కు పంపారు. ఆ తర్వాత ఆయన రాజీనామాను ఆమోదించాలని నిర్ణయించుకుంది.
రాష్ట్ర బిజెపి నాయకత్వంపై చాలా కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాజా సింగ్ (Raja Singh), పార్టీ నాయకులపై పరోక్షంగా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూ వొచ్చారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి తన నామినేషన్‌ను అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు రాజా సింగ్ ప్రవర్తన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా లేదని పేర్కొంటూ హైకమాండ్ ఆయన రాజీనామాను ఆమోదించాలని నిర్ణయించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.