Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ (IAS transfers) అయ్యారు. ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు స్థానచనలం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అభివృద్ధి సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్లాగ్‌షిప్ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్ నియమితులయ్యారు. సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌గానూ ఆయన కొనసాగనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అనితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రవాణాశాఖ కమిషనర్‌గా కె.ఇలంబర్తిని నియమించిన ప్రభుత్వం.. పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను ఆయనకు కేటాయించింది. మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్యదర్శి బాధ్యతలు సీఎస్ వద్దే ఉంచింది.ఇక జీఏడీ కార్యదర్శిగా ఇ.శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. టీజీ ఆయిల్‌ఫెడ్ ఎండీగా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా జి.జితేందర్‌రెడ్డిని నియమించింది. అలాగే, ఎస్సీ సహకార సంస్థ ఎండీగా ఆయనకు అదనపు బాధ్యతలను కేటాయించింది.
తెలంగాణ ఐఏఎస్ అధికారుల బదిలీలు – అదనపు బాధ్యతల వివరాలు
| క్రమ సంఖ్య | అధికారి పేరు | ప్రస్తుత / కొత్త పదవి | అదనపు బాధ్యతలు / మార్పులు | 
|---|---|---|---|
| 1 | సవ్యసాచి ఘోష్ | ప్లాగ్‌షిప్ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక సీఎస్ | సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌గా కొనసాగుతారు | 
| 2 | సైదులు | అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక కార్యదర్శి | అదనపు బాధ్యతలు | 
| 3 | అనితా రామచంద్రన్ | గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ | అదనపు బాధ్యతలు | 
| 4 | కె. ఇలంబర్తి | రవాణా శాఖ కమిషనర్ | పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు | 
| 5 | ఇ. శ్రీధర్ | జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ) కార్యదర్శి | అదనపు బాధ్యతలు | 
| 6 | యాస్మిన్ బాషా | టీజీ ఆయిల్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ | అదనపు బాధ్యతలు | 
| 7 | జి. జితేందర్ రెడ్డి | ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ | ఎస్సీ సహకార సంస్థ ఎం.డి.గా అదనపు బాధ్యతలు | 
| 8 | (సీఎస్ వద్దే ఉంచారు) | మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్యదర్శి | బాధ్యతలు సీఎస్ వద్దే కొనసాగింపు | 
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    