Sarkar Live

Terror Attack | ఉగ్ర‌దాడితో తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం..

జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని అనంతనాగ్‌ జిల్లాలోని పహెల్‌గామ్ (Pahalgam)లోఉగ్రవాదులు చేసిన‌ దాడులు (Terror Attack) భయభ్రాంతులకు గురిచేశాయి. ప్రత్యేకంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడిలో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవ‌డం విషాదాన్ని మిగిల్చింది. ఈ మార‌ణ‌కాండ‌లో మ‌న

Jammu and Kashmir

జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని అనంతనాగ్‌ జిల్లాలోని పహెల్‌గామ్ (Pahalgam)లో
ఉగ్రవాదులు చేసిన‌ దాడులు (Terror Attack) భయభ్రాంతులకు గురిచేశాయి. ప్రత్యేకంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడిలో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవ‌డం విషాదాన్ని మిగిల్చింది. ఈ మార‌ణ‌కాండ‌లో మ‌న తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఇద్ద‌రు కూడా అసువులు బాసారు. విశాఖపట్నానికి (Visakhapatnam) చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి (Chandramouli) దుర్మరణం చెందారు. ఆయన తన భార్య నాగమణితో కలిసి పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి మనీష్ రంజన్ (Intelligence Bureau (IB) officer Manish Ranjan) కూడా మృతి చెందారు. కుటుంబంతో కలిసి బైసారన్ పర్యటనలో పాల్గొన్న మనీష్‌, ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.

Terror Attack : స్వ‌ర్గ‌సీమ‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు

పహెల్‌గామ్ (Pahalgam), బైసారన్ (Baisaran) వంటి ప్రాంతాలు సాధారణంగా ‘మినీ స్విట్జర్లాండ్’గా పిలవబడే పర్యాటక ప్రదేశాలు. అచ్చంగా స్వర్గాన్ని తలపించే అందాలు, మంచుతో కప్పబడిన కొండలు, పచ్చని లోయలు – ఇవన్నీ దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. అయితే ఇప్పుడు అదే ప్రాంతం ఉగ్రవాదుల అరాచకాలకు వేదికైంది.

చంద్రమౌళిపై నిర్దాక్షిణ్యంగా దాడి

పర్యాటకులపై దాడి (Terror Attack) కి తెగబడిన ఉగ్రవాదులు ఏ ఒక్కరినీ వదల్లేదు. చంద్రమౌళి కూడా అటువంటి పరిస్థితిలో తన ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించిన వెంటనే ఆయన్ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. పారిపోయే ప్రయత్నం చేసిన సమయంలో అతనిని ఆయ‌న్ను వెంబడించి, హింసాత్మకంగా కాల్చిచంపారు. “నన్ను వదలండి” అని ఆయ‌న‌న వేడుకున్నప్పటికీ ముష్క‌రులు కనికరించలేదు. ఈ ఘ‌ట‌న‌కు ప్ర‌త్య‌క్ష సాక్షి అయిన‌ ఆయన భార్య నాగమణి షాక్‌కు గుర‌య్యారు. చంద్ర‌మౌళి మృతదేహాన్ని ఎయిర్‌లిఫ్ట్ ద్వారా విశాఖకు తరలించారు. అంత్య‌క్రియ‌లు ఈ రోజు జ‌రిగాయి.

ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి, నేవీ లెఫ్టినెంట్ కూడా మృతి

ఈ దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి మనీష్ రంజన్ (Intelligence Bureau (IB) officer Manish Ranjan) కూడా మృతి చెందారు. కుటుంబంతో కలిసి బైసారన్ పర్యటనలో పాల్గొన్న మనీష్‌, ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. అలాగే హర్యానాకు చెందిన భారత నౌకాదళ అధికారి, లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా ఈ దాడిలో మరణించారు. ఈ నెల 16న ఆయన వివాహం జరిగింది. న‌వ‌దంప‌తులు హ‌నీమూన్ కోసం వెళ్లారు. కొత్త‌గా దాంప‌త్య జీవితంలో అడుగు పెట్టిన విన‌య్ న‌ర్వాల్ త‌న‌ భార్య‌తో క‌లిసి స‌ర‌దాగా క‌శ్మీర్‌కు వెళ్ల‌గా ఉగ్ర‌వాదులు ఆయ‌న్ను పొట్ట‌లో పెట్టుకున్నారు.

ఇద్ద‌రు విదేశీయులు కూడా..

పహెల్‌గాంలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో మొత్తం 27 మంది మృతి చెందగా, 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో ఇజ్రాయెల్, ఇటలీ దేశాలకు చెందిన ఇద్ద‌రు ఉన్నారు. మిగతా వారంతా భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారే.

అల‌ర్ట్ అయిన కేంద్రం

ఈ దాడి తర్వాత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. సంఘటన స్థలానికి హోం మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) తక్షణమే చేరుకుని ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఉమర్ అబ్దుల్లా (Omar Abdullah), హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, నిఘా విభాగం డైరెక్టర్ తపన్ డేగాతో అమిత్‌షా స‌మావేశ‌మ‌య్యారు. ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు. అనంతరం అమిత్ షా ఘటనాస్థలికి ఈ రోజు స్వయంగా వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?