Sarkar Live

TGSRTC | నేత్ర‌దానానికి టీజీఎస్ఆర్టీసీ సహకారం..

Free corneal transport Telangana : సామాజిక బాధ్య‌త‌లో భాగంగా నేత్ర‌దానానికి టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేక‌రించిన నేత్రాల‌ను ఉచితంగా త‌మ బ‌స్సుల్లో హైద‌రాబాద్‌కు త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలోనే ‘నెట్‌వ‌ర్క్ టు సైట్’ పేరుతో

TGSRTC
  • ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా కార్నియాల త‌ర‌లింపు
  • స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రితో టీజీఎస్ఆర్టీసీ ఒప్పందం

Free corneal transport Telangana : సామాజిక బాధ్య‌త‌లో భాగంగా నేత్ర‌దానానికి టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేక‌రించిన నేత్రాల‌ను ఉచితంగా త‌మ బ‌స్సుల్లో హైద‌రాబాద్‌కు త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలోనే ‘నెట్‌వ‌ర్క్ టు సైట్’ పేరుతో స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రి (Sarojini Devi Eye Hospital) తో టీజీఎస్ఆర్టీసీ ఒక ఒప్పందం చేసుకుంది.

హైద‌రాబాద్ మెహిదిప‌ట్నంలోని స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో సోమ‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఒప్పంద ప‌త్రాల‌పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్.. ఆ ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ మోదిని ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేసి ప‌ర‌స్ప‌రం మార్చుకున్నారు.

ఈ ఒప్పందం ప్ర‌కారం.. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఆసుపత్రుల్లో నేత్ర‌దాత‌ల నుంచి సేక‌రించిన కార్నియాల‌ను ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా హైద‌రాబాద్‌కు పంపిస్తారు. సేక‌రించిన కార్నియాల‌ను ఐస్ బాక్స్‌లో భ‌ద్ర‌ప‌రిచి ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో వైద్య సిబ్బంది అంద‌జేస్తారు. వాటిని త‌మ బ‌స్సుల్లో హైద‌రాబాద్‌కు ఆర్టీసీ డ్రైవ‌ర్లు తీసుకువ‌స్తారు. బ‌స్సులు హైద‌రాబాద్ చేరుకోగానే స‌రోజిని కంటి ఆసుప‌త్రి సిబ్బంది వ‌చ్చి వాటిని తీసుకుని ఐ బ్యాంక్‌లో భ‌ద్ర‌ప‌రుస్తారు.

టీజీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌న‌ర్ మాట్లాడుతూ.. పవిత్రమైన ఈ దాతృత్వ కార్యక్రమం (TGSRTC social responsibility)లో టీజీఎస్ఆర్టీసీ భాగ‌స్వామ్యం కావ‌డం సంతోషంగా ఉంద‌ని అన్నారు. ‘నెట్‌వ‌ర్క్ టు సైట్’ పై ఆర్టీసీ సిబ్బందికి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. మృతి చెందాక అత్యంత విలువైన అవ‌య‌వాల‌ను మ‌ట్టిపాలు చేసేక‌న్నా అంధ‌త్వంతో లోకాన్ని చూడ‌లేని వారికి చూపునీయ‌డం గొప్ప‌కార్యమ‌ని ఆయ‌న అన్నారు. భారతదేశంలో ప్ర‌తి ఏటా 3 లక్షలకు పైగా మంది నేత్రాల కోసం ఎదురుచూస్తుంటే.. కేవ‌లం 18 వేల మార్పిడిలు మాత్ర‌మే జ‌రుగుతున్నాయ‌ని గుర్తుచేశారు. మ‌ర‌ణాంత‌రం నేత్రదానం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ మోదిని మాట్లాడుతూ.. ఉచితంగా కార్నియాల‌ను బ‌స్సుల్లో ఉచితంగా త‌ర‌లించేందుకు ముందుకువ‌చ్చిన టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు. ఆర్టీసీ బ‌స్సుల్లో సుర‌క్షితంగా కార్నియాల‌ను స‌రోజిని కంటి ఆసుప‌త్రికి తీసుకువ‌చ్చి రోగుల‌కు అమ‌ర్చుతామ‌ని ఆమె చెప్పారు.

నేత్ర‌దాన ప్ర‌తిజ్ఞ చేసిన స‌జ్జ‌న‌ర్

ఈ కార్య‌క్ర‌మంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌న‌ర్ నేత్ర‌దాన ప్ర‌తిజ్ఞ చేశారు. నేత్ర‌దాన ప్ర‌తిజ్ఞా ప‌త్రంపై సంత‌కం చేసి స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ మోదినికి అంద‌జేశారు. అంత‌కుముందు నేత్ర‌దానంలో కీల‌క‌పాత్ర పోషిస్తోన్న జీవ‌న్‌దాన్ కోఆర్డినేట‌ర్లు రియాజుద్దీన్, విశ్వ‌ర‌లింగం, అరుణ‌, శ్రీల‌త‌ల‌ను స‌న్మానించారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్‌ల‌కు కార్నియాల‌ను త‌ర‌లించే ఐస్ బాక్స్‌ల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉస్మానియా మెడిక‌ల్ కాలేజీ ప్రిన్సిప‌ల్ డాక్ట‌ర్ రాజారావు, ఎన్‌పీసీబీ జాయింట్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ క‌ళావ‌తి, ప్ర‌భుత్వ ఆసుప‌త్రి సిద్దిపేట సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ సంగీత‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?