Thug Life Movie Review | కమల్ హాసన్ మణిరత్నం(Kamal Hassan, Mani Ratnam combo) వచ్చిన మూవీ నాయకుడు(nayakudu) సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే.ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. మూడున్నర దశాబ్దాల తర్వాత వీరి కాంబోలో రిలీజ్ అయిన మూవీ థగ్ లైఫ్(Thug Life). వీరిద్దరి కాంబోలో వచ్చిన నాయకుడు సినిమాకు మించి ఈ మూవీ ఉంటుందన్న కమల్ హాసన్ స్టేట్మెంట్ కి తగ్గట్టుగా ఈ మూవీ ఉందా లేదా అనేది తెలుసుకుందాం…
Thug Life స్టోరీ …
రంగరాయ శక్తి రాజన్ (కమల్ హాసన్)ఒక పెద్ద డాన్. అతని పట్టుకునే క్రమంలోనే అమర్(శింబు) తండ్రి చనిపోతాడు. దీంతో రంగరాయ శక్తి రాజన్ అతడిని చేరదీస్తాడు. అమర్ శక్తిని కాపాడుకునే కుడి భుజం అవుతాడు. ఒక కారణం వల్ల వీరిద్దరు విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే చూడాల్సిందే.
మూవీ ఎలా ఉందంటే….
మణిరత్నం,కమల్ హాసన్ కాంబో దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత సెట్ అయిందంటే ఫాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకుంటారో ఊహించుకోవచ్చు. వారి అంచనాలను ఈ మూవీ పూర్తి స్థాయిలో అందుకోలేదనిపించింది. మూవీ చూసిన ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన వస్తుంది. మొదలైన కొద్దిసేపు ప్రేక్షకుడికి మంచి థ్రిల్ ను పంచిన మూవీ కాసేపటికే బోర్ కొట్టే దిశగా వెళుతుంది. స్లో నరేషన్ తో విసుగు తెప్పిస్తుంది. ఇక సెకండాఫ్ మరింత అధ్వానంగా నడుస్తుంది. ఎక్కడ కూడా ఇది మణిరత్నం మూవీలా ఆడియన్స్ కి అనిపించదు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంటర్వెల్, అక్కడక్కడ కొన్ని సీన్స్ తప్పితే మూవీ మొత్తం నిరాశ కలిగించే విధంగా ఉంది. ఫస్ట్ హాఫ్ చూస్తే బలం అనుకున్న కమల్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మైనస్ గా మారిపోయాడు. నాయకుడు, నవాబ్ లాంటి మూవీలతో ఈ తరహా స్టోరీలను ఇంట్రెస్టింగ్ గా నడిపించిన మణిరత్నం అదే రకమైన రివేంజ్ డ్రామాను మళ్లీ తెరపై చూపించే ప్రయత్నం బెడిసి కొట్టిందని చెప్పచ్చు.
Thug Life నటీ నటులు, సాంకేతిక నిపుణుల పనితీరు…
ఎప్పటిలాగే కమల్ హాసన్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. తెరపై ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్ లు చేసిన కమల్ ఈ మూవీలో కొత్తగా కనిపించకున్న కూడా తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు. ఇక శింబు కూడా తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. కమల్ తో పోటా పోటీగా యాక్ట్ చేశాడు.త్రిష క్యారెక్టర్ తన ఫ్యాన్స్ కి నచ్చని విధంగా ఉంటుంది. మూవీ లో కూడా అలా డిజైన్ చేయడం మైనస్ గా మారిందని చెప్పొచ్చు. త్రిష లాంటి టాప్ హీరోయిన్ తో ఆ క్యారెక్టర్ చేయించడం మూవీకి మైనస్ అని చెప్పొచ్చు.అబిరామి,మిగతా నటీనటులు వారి వారి పరిధి మేరకు బాగానే యాక్ట్ చేశారు. మణిరత్నం అన్ని మూవీస్ కి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీకి ఇచ్చిన మ్యూజిక్ తో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేక పోయాడు.కీలకమైన బీజీఏం ఇవ్వడంలో నిరాశపరిచాడు.రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవరాల్ గా ఈ మూవీ మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వచ్చిన మూవీ లా అనిపించలేదు.
నటన పరంగా:
- కమల్ హాసన్ – తన స్థాయికి తగ్గదిగా నటన చూపించినా కొత్తదనం లేకపోయింది.
- శింబు – శక్తివంతమైన పాత్రను తనదైన శైలిలో బాగా పోషించాడు.
- త్రిష – పాత్ర డిజైన్ బలహీనంగా ఉండడం కారణంగా ఆమె టాలెంట్ వృధా అయింది.
- మ్యూజిక్ & టెక్నికల్ వర్క్:
ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఆకట్టుకోలేకపోయింది. - రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ మాత్రం విజువల్‌గా మంచి అనుభూతిని ఇచ్చింది.
- స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ పరంగా బలహీనతలు స్పష్టంగా కనిపించాయి.
ముగింపు..
కమల్, మణిరత్నం అభిమానులు ఎంతో ఆస్తిగా ఎదురు చూసిన ఈ మూవీ, ఆ అంచనాలను అందుకోలేకపోయింది. కథ, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్ అన్నీ మిక్స్ అయినా… చివరికి “మణిరత్నం మూవీలా అనిపించలేదు” అనే భావన ఎక్కువ మంది ప్రేక్షకుల్లో కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.