Sarkar Live

Ind vs Ban U19 Asia Cup 2024 | ఆసియా కప్ 2024.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైన భారత్

Ind vs Ban U19 Asia Cup 2024 | క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది ఆసియా కప్ ఫైనల్ లో భారత్ పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. నేడు జరిగిన అండర్‌-19 ఆసియా కప్‌ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌

Ind vs Ban U19 Asia Cup 2024

Ind vs Ban U19 Asia Cup 2024 | క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది ఆసియా కప్ ఫైనల్ లో భారత్ పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. నేడు జరిగిన అండర్‌-19 ఆసియా కప్‌ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ జట్టు భారత్ పై 59 పరుగుల తేడాతో గెలుపొందింది.మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 198 పరుగులు చేయగా నిర్ణీత లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో భారత క్రికెటర్ లు తడబడ్డారు. ఈ మ్యాచ్ లో బంగ్లా క్రికెటర్ లు పూర్తి ఆధిపత్యాన్ని చేలాయించి భారత జట్టును కేవలం 139 పరుగులకే కట్టడి చేసి ఆలౌట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో బంగ్లాదేశ్ అండర్-19 విభాగంలో 2024 ఆసియా కప్ విజేతగా చరిత్ర సృష్టించింది.

 

బంగ్లాదేశ్ (Bangladesh) లో తలపడిన భారత జట్టు 59 పరుగుల తేడాతో  ఓటమిని చవిచూసింది.199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువ భారత్ 36 ఓవర్లలో 139 పరుగులకు కుప్పకూలిపోయింది. మహ్మద్ అమన్ (26 పరుగులు), హార్దిక్ రాజ్ (24 పరుగులు) మాత్రమే  రాణించారు. భారీ అంచనాలు పెట్టుకున్న యువ క్రికెటర్లు  వైభవ్ సూర్యవంశీ (9 పరుగులు) నిరాశ పర్చా.డు. గత సంవత్సరం విజేతగా నిలిచిన బంగ్లాదేశ్ ఈసారి కూడా కప్ ను ​ కైవసం చేసుకుంది.

Ind vs Ban U19 Asia Cup 2024 : మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్ జట్టు 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్ అయింది. రిజాన్ హసన్ (47 పరుగులు; 65 బంతుల్లో 3 x4 ), షిహాబ్ (40 పరుగులు; 67 బంతుల్లో 3×4, 1X6), ఫరిద్ హసన్ (39 పరుగులు; 49 బంతుల్లో 3×4) ప్రదర్శన చేశారు. ఇక భారత బౌలర్లలో యుధాజిత్ గుహా, చేతన్ శర్మ , హార్దిక్ రాజ్ తలో 2, కిరణ్‌, కేపీ కార్తికేయ, ఆయుష్‌ మాత్రే తలో 1 వికెట్‌ పడగొట్టారు. కాగా, గతేడాది కూడా భారత్​ను బంగ్లాదేశ్​ సెమీ ఫైనల్​లో ఓడించింది.

1989 నుంచి నిర్వ‌హిస్తున్న అండర్-19 వరల్డ్ కప్‌లో యువ భారత్ ఎనిమది సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 1989, 2003, 2012, 2013/14, 2016, 2018, 2019, 2021లో టైటిల్ కైవ‌సం చేసుకుంది. మూడు సార్లు ఫైనల్‌కు వెళ్లిన బంగ్లాదేశ్ రెండు సార్లు విజేతగా నిలిచింది. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ ఒక్కోసారి ఆసియా కప్‌ను గెలుచుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?