Sarkar Live

Group-2 Hall Tickets | గ్రూప్-2 పరీక్ష హాల్​టికెట్లు విడుదల.. డౌన్​లోడ్ చేసుకోండిలా..!

Group-2 Hall Tickets Realesed : గ్రూప్​-2 పరీక్ష హాల్​టికెట్లను టీజీపీఎస్సీ విడుద‌ల చేసింది. ఈమేర‌కు హాల్ టికెట్ల‌ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్​సైట్ ద్వారా డౌన్​లోడ్ చేసుకోవాల‌ని అభ్యర్థులకు సూచించింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 1,368

Group-2 Hall Tickets

Group-2 Hall Tickets Realesed : గ్రూప్​-2 పరీక్ష హాల్​టికెట్లను టీజీపీఎస్సీ విడుద‌ల చేసింది. ఈమేర‌కు హాల్ టికెట్ల‌ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్​సైట్ ద్వారా డౌన్​లోడ్ చేసుకోవాల‌ని అభ్యర్థులకు సూచించింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలను ​ ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు సుమారు 5.51లక్షల దరఖాస్తులు అందాయి.

రెండు రోజులు ప‌రీక్ష‌లు

రెండు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం మొత్తం నాలుగు పేపర్లతో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు. ఉదయం పేపర్​ -1, పేపర్​-3లకు 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు అభ్యర్థులను ప‌రీక్ష కేంద్రాల్లోకి ​అనుమతిస్తారు. ఒక్క నిమిషం నిబంధ‌న అమ‌లు ఉంద‌ని అభ్య‌ర్థులు గ‌మ‌నించాలి.

హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ నెంబరు, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను న‌మోదు చేయాలి. అనంతరం డౌన్​లోడ్​ పీడీఎఫ్​ అనే ఆప్షన్​పై క్లిక్​ చేస్తే వెంటనే హాల్​టికెట్​ డౌన్​లోడ్​ అవుతుంది. ఈ ప్రక్రియలో ఏవైనా సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ కేంద్రాల‌ను టీజీపీఎస్సీ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ప‌నిదినాల్లో ​ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.00గంటల వరకు ఫోన్​ చేసి వివరాలను పొంద‌వ‌చ్చు. ఇంకా అదనపు సమాచారం కోసం టీజీపీఎస్సీ హెల్ప్‌లైన్‌ నంబర్లు 23542185/23542187/040-22445566/ నంబ‌ర్ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.లేదా ఈ-మెయిల్‌ కావాలంటే helpdesk@tspsc.gov.inకు చేయవచ్చు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  ఎక్స్(ట్విట్టర్)  లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!