- చుక్కలు వేయడం ఆగొద్దు.. మనల్ని ఆపేదెవరంటున్న అధికారులు
- బరితెగించిన ఎంవీఐ ల వెనుక ఉన్నదెవరో?
- రవాణా శాఖ లో కలకలం రేపిన లంచాల వివరాలు
- చర్చనీయాంశమైన “సర్కార్” కథనం..
RTA Corruption in Hanmakonda | ఆ అధికారులు బరితెగించారు.ఆర్టీఏ కార్యాలయంలో ఉన్నతాధికారి నుండి క్లర్క్ వరకు ఏ పనికి ఎంత లంచం తీసుకుంటున్నారో “ఆ కార్యాలయంలో కనకవర్షం” కథనం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చినప్పటికి ఎలాంటి అదురు బెదురు లేకుండా దందాను కొనసాగిస్తున్నారు.రోజూ చుక్కల(లంచాల) రూపంలో లక్షల రూపాయల మామూళ్లు వస్తుండడంతో దందాను ఆపేందుకు అధికారులు ఇష్టపడడంలేదు.”ఎవ్వరన్నా రానియ్ అస్సలు తగ్గేదేలే”అని పుష్ప-2 సినిమా రేంజులో అధికారులు డైలాగ్స్ కొడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కోడ్(చుక్క)వేయడం ఆగొద్దూ… మనల్ని ఆపేదెవరంటూ ప్రైవేట్ అసిస్టెంట్ లకు అధికారులు హుకుం జారీచేశారని దాంతో ఎవరైనా వస్తే అధికారులే చూసుకుంటానన్నప్పుడు మనకేం భయం అని ప్రైవేట్ అసిస్టెంట్ లు పత్రాలపై కోడ్(చుక్క) వేస్తున్నట్లు తెలిసింది.
వారు బరితెగించారు…
హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు బరితెగించినట్లు తెలుస్తోంది.లంచాలు ఏవిధంగా వసూళ్లు చేస్తున్నారు, ఏపనికి(సేవకు) ఎంత తీసుకుంటున్నారు, ఎవరికి ఎంత అనే విషయం ప్రచురించినప్పటికి వీరిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదని తెలుస్తోంది.నిఘా వర్గాలు ఆరా తీసినా..? అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేసినా..? తమకేంకాదు అనే ధీమాతో ప్రైవేట్ అసిస్టెంట్ లతో కోడ్(చుక్క)ల రూపంలో వసూళ్లు చేపిస్తున్నట్లు తెలుస్తోంది.యథేచ్ఛగా బరితెగించి దందాను కొనసాగిస్తున్నారంటే వారికి రవాణా శాఖ లోని ఉన్నతాధికారుల సహకారం ఏవిధంగా ఉందో అర్ధంచేసుకోవచ్చు.
RTA Corruption : కలకలం రేపిన లంచాల వివరాలు..
“ఆ కార్యాలయంలో కనకవర్షం” అనే కథనం రవాణా శాఖ లో తీవ్ర దుమారం రేపింది. హన్మకొండ ఆర్టీఏ కార్యాలయం (Hanmakonda RTA Office) లో ఉన్నతాధికారి నుంచి క్లర్క్ వరకు ఏ పనికి ఎంత లంచం తీసుకుంటున్నారు. అసలు ఆ పనికి ప్రభుత్వ ఫీజు ఎంత అనే వివరాలు ప్రచురించడంతో డిటిసి మొదలుకొని ఎంవీఐ లతో పాటు కార్యాలయ ఉద్యోగులు కంగుతిన్నట్లు తెలుస్తోంది. “సర్కార్ వెబ్ సైట్” ప్రచురించిన” ఆ కార్యాలయంలో కనకవర్షం” వైరల్ కావడంతో రవాణా శాఖ ఉన్నతాధికారులతోపాటు నిఘా వర్గాలు ఆరాతీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో ఏపని కి ఎవరు(DTO/మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్(MVI)/ఏవో/క్లర్క్)ఎంత తీసుకుంటున్నారో వసూళ్ల విధానం ప్రధానంగా “లంచాల వివరాలు” బయట పెట్టడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తూ వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా “సర్కార్” వెబ్ సైట్ కు అభినందనలు తెలియజేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..