Sarkar Live

Ballo Village | నో లిక్క‌ర్‌, నో డీజే.. ఓన్లీ జోష్.. అక్క‌డ‌ అన్నీ ఆద‌ర్శ వివాహాలే..

Ballo Village | అది ఒక‌ ఆద‌ర్శ గ్రామం. ఆ పంచాయ‌తీ తీసుకొనే నిర్ణ‌యాలు వినూత్నం.. స్ఫూర్తిదాయకం. అక్క‌డి ప్ర‌జ‌లందరిదీ ఒకే బాట‌. అంద‌రూ ఒకే మాట‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందే. పంచాయ‌తీ నియ‌మాల‌ను అనుస‌రించాల్సిందే. వీటిని పాటించి బ‌హుమ‌తి కొట్టాల్సిందే. పంజాబ్

Ballo Village

Ballo Village | అది ఒక‌ ఆద‌ర్శ గ్రామం. ఆ పంచాయ‌తీ తీసుకొనే నిర్ణ‌యాలు వినూత్నం.. స్ఫూర్తిదాయకం. అక్క‌డి ప్ర‌జ‌లందరిదీ ఒకే బాట‌. అంద‌రూ ఒకే మాట‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందే. పంచాయ‌తీ నియ‌మాల‌ను అనుస‌రించాల్సిందే. వీటిని పాటించి బ‌హుమ‌తి కొట్టాల్సిందే. పంజాబ్ రాష్ట్రం బ‌ఠిండా జిల్లా (Punjab’s Bathinda district)లోని బ‌ల్లో (Ballo Village) గ్రామ పంచాయ‌తీ ఈ త‌ర‌హా ఆద‌ర్శ నిర్ణ‌యాలు తీసుకుంటోంది. త‌ద్వారా ప్ర‌జ‌ల‌ను స‌న్మార్గంలో న‌డిపిస్తూ ఆ ప‌ల్లెను ప్ర‌గ‌తి ప‌థం వైపు తీసుకెళ్తోంది.

వినూత్న ప్రోత్సాహం

ఇప్ప‌టికే అనేక వినూత్న నిర్ణ‌యాల‌తో గ్రామాన్ని ఆద‌ర్శ‌ప్రాయంగా మారుస్తున్న బ‌ల్లో పంచాయ‌తీ.. తాజాగా మ‌రో కార్యాచ‌ర‌ణ‌కు తెర‌తీసింది. అక్క‌డ జ‌రిగే వివాహ వేడుక‌ల్లో డీజే సౌండ్ (DJ music) సిస్టం వినియోగం, మ‌ద్యాన్ని(liquor ) నిషేధించింది. ఈ నిబంధ‌న‌కు ఎంత‌టి వారైనా క‌ట్టుబ‌డి ఉండాల్సిందే. దీన్ని పాటించే వారికి ఆ గ్రామ పంచాయ‌తీ రూ. 21 వేల న‌గ‌దు బ‌హుమ‌తితో ప్రోత్స‌హిస్తోంది.

Ballo Village : నిబంధ‌న‌లు ఎందుకంటే..

వివాహ వేడుక‌ల్లో డీజే సౌండ్ సిస్టం వినియోగం, మ‌ద్యాన్ని నిషేధంపై ఆ గ్రామ పంచాయ‌తీ స‌ర్పంచ్ అమ‌ర్‌జీత్ కౌర్ (Sarpanch Amarjit Kaur) మాట్లాడుతూ ఈ వినూత్న ఆలోచ‌న‌తో వృథా ఖ‌ర్చులు త‌గ్గుతాయ‌న్నారు. పెళ్లిళ్ల‌ల్లో మ‌ద్యాన్ని వినియోగించ‌డం వ‌ల్ల గొడ‌వ‌ల‌కు ఆస్కారం ఉంటుంద‌ని, డీజే మ్యూజిక్ వ‌ల్ల విద్యార్థుల చ‌దువుల‌కు అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని, అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వివ‌రించారు.

సంతోషంగా అంగీక‌రిస్తున్న గ్రామ‌స్థులు

‘మద్యం వినియోగం వల్ల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. అలాగే ఘర్ష‌ణ‌లు చోటుచేసుకుంటున్నాయి. డీజే మ్యూజిక్ వల్ల విద్యార్థుల చదువు దెబ్బతింటోంది. ఇవి గ్రామాభివృద్ధికి ప్రతిబంధకంగా మారాయి’ అని స‌ర్పంచ్ అమ‌ర్‌జీత్ కౌర్ అన్నారు. గ్రామ‌స్థులతో చ‌ర్చించాకే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆమె చెప్పారు. గ్రామ పంచాయతీ నిర్ణయాన్ని ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తూ సంతోషంగా అంగీక‌రించార‌ని తెలిపారు. మద్యం, డీజే మ్యూజిక్ లేకుండా వివాహ వేడుక‌లు జ‌రుపుకొనే కుటుంబాలకు రూ. 21 వేల‌ బహుమతి ఇవ్వడంతో గ్రామస్థుల్లో మార్పు వ‌స్తోంద‌ని అన్నారు. ఈ ఆలోచ‌న‌ వల్ల గ్రామంలో సాంఘిక బాధ్యత పెరగడం మాత్రమే కాకుండా ఆర్థిక వనరులను సమర్థంగా వినియోగించుకునే అలవాటు కూడా వస్తుందని అభిప్రాయ‌ప‌డ్డారు.

క్రీడలకు ప్రోత్సాహం

బల్లో గ్రామ పంచాయతీ ఈ నిర్ణయంతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేప‌డుతోంది. ముఖ్యంగా యువ‌త పెడ‌దారి ప‌ట్టి అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు అల‌వాటు కాకుండా క్రీడ‌ల‌ను ప్రోత్స‌హిస్తోంది. ఇది యువత శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా వారిలో క్రమశిక్షణ, సమగ్రత, స్నేహ‌భావం లాంటి లక్షణాలను పెంపొందించడంలో సహాయపడుతుంద‌ని భావిస్తోంది.

సేంద్రియ వ్యవసాయంపై దృష్టి

బ‌ల్లో గ్రామ రైతులు సేంద్రియ వ్యవసాయం(Organic Farming) పై దృష్టి పెట్టారు. పంచాయ‌తీ ప్రోత్సాహంతో సేంద్రియ ప‌ద్ధ‌తిలో పంట‌ల‌ను పండించుకుంటున్నారు. ఇందుకు పంచాయ‌తీ ఉచితంగా విత్త‌నాలు పంపిణీ చేస్తోంది. రైతులు మంచి లాభాలను గ‌డించ‌డ‌మే కాకుండా పర్యావరణ పరిరక్షణకు ఇదెంతో ముఖ్య‌మని గ్రామ పంచాయ‌తీ పాల‌క‌వ‌ర్గం భావిస్తోంది.

బయోగ్యాస్ ప్లాంట్

గ్రామంలోని కుటుంబాలతోపాటు వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పంచాయతీ ఒక బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కూడా చేసింది. ఇది గ్రామంలో గృహ అవసరాలకు, వ్యవసాయ అవసరాలకు పర్యావరణ హితమైన పరిష్కార‌మని అంటోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!