Sarkar Live

Director Sukumar : సుకుమార్ నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుందో..!

Tollywood News : మొదట్లో లెక్కల మాస్టర్ గా పనిచేసిన డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) సినిమా మీద ప్రేమతో దానికి పులిస్టాప్ పెట్టారు. తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయి మొదటి సినిమా ఆర్య తోనే బిగ్గెస్ట్ హిట్

Director Sukumar

Tollywood News : మొదట్లో లెక్కల మాస్టర్ గా పనిచేసిన డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) సినిమా మీద ప్రేమతో దానికి పులిస్టాప్ పెట్టారు. తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయి మొదటి సినిమా ఆర్య తోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. గంగోత్రి మూవీ తో ఓ మాదిరి హీరోగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ తో ఆర్య మూవీ తీసి స్టైలిష్ స్టార్ గా ప్రేక్షకులకు దగ్గర చేసాడు. అల్లు అర్జున్ అంతకుముందు తీసిన మూవీలో కంటే లుక్ పరంగా ఆర్య మూవీలో బెటర్ గా కనిపిస్తాడు. మొదటి సినిమాతోనే సుకుమార్ టేకింగ్ వైజ్ మార్కులు కొట్టేశాడు.

తర్వాత రామ్ తో తీసిన జగడం మూవీ తన ముందు సినిమా ఆర్య సినిమా కంటే భిన్నమైన స్టోరీ ని ఎంచుకుని మాస్ ఎలివేషన్స్ తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీతో సరైన హిట్టు దక్కలేదు గానీ స్టోరీని అద్భుతంగా టేకింగ్ చేశాడు. ఈ మూవీ చూసే దర్శక ధీరుడు రాజమౌళి ఇండస్ట్రీలో తనకు పోటీ ఎవరైనా ఉంటే అది సుకుమారే అని అనుకున్నాడు.

ఇక మూడో సినిమా అల్లు అర్జున్ తోనే ఆర్య 2 అని తీశారు. ఈ మూవీలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ పీక్ లో ఉంటుంది. ఎక్కువ కలెక్షన్లు రాకపోయినా ఫ్రెండ్షిప్, లవ్ ని సుక్కు స్టైల్ లో చూపించిన విధానం ఆడియన్స్ నుంచి సూపర్ మూవీ గా టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ డైరెక్టర్గా సుకుమార్ ని మరొక మెట్టెక్కెలా చేసింది.

తర్వాత నాగచైతన్యతో 100% లవ్ అని తనలో ఉన్న లెక్కల మాస్టర్ ని బయటకు తీశారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ ని సొంతం చేసుకుని నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కలిసి ఉన్న ఒక మంచి లవ్ స్టోరీ ని ప్రేక్షకులకు అందించారు. సుక్కు మార్క్ మాత్రం ఈ మూవీలో మిస్ అవ్వదు.

ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు

ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తో వన్ నేనొక్కడినే తీసి విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో అలరించాలని చూశారు కానీ తన స్క్రీన్ ప్లేను పట్టుకోలేకపోయినా ఆడియన్స్ డివైడ్ టాక్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత టీవీలలో పెద్ద హిట్టుగా ఈ మూవీ నిలిచింది. మహేష్ బాబు లుక్ పరంగా పెర్ఫార్మెన్స్ పరంగా ఈ మూవీ మంచి పేరు తీసుకొచ్చింది. మహేష్ బాబులోని వేరే లెవల్ యాక్టింగ్ ని బయటకు తీశారు సుకుమార్.

నాన్న కాన్సెప్ట్ తీసుకొని ఒక రివెంజ్ డ్రామాగా మంచి ఎమోషన్స్ తో కూడిన ‘నాన్నకు ప్రేమతో’ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసి హిట్టు కొట్టారు. ఈ మూవీలో సుకుమార్ టేకింగ్ తనదైన లాజిక్స్ తో వెరైటీగా ఉంటుంది. ఎక్కడ కూడా ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా లాజిక్స్ తో థ్రిల్ చేశాడు.

Director Sukumar : పుష్పతో తిరుగులేని పాపులారిటీ

చాలా గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) తో పుష్ప మూవీని తీశాడు. ఈ మూవీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట డివైడ్ టాక్ వచ్చిన ఆ తర్వాత ఏ రేంజ్ లో హిట్ కొట్టిందో మనకు తెలిసిందే.సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ ని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక పుష్ప-2 అయితే ఇండియాలోనే అత్యధిక వసూల్లు సాధించిన చిత్రంగా నిలవడానికి ఒక అడుగు దూరంలో ఉంది. ఈ మూవీతో అన్ని ఇండస్ట్రీలను తన వైపుకు తిప్పుకున్నాడు సుకుమార్. ఈ మూవీతో సుకుమార్ ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్ల లిస్టులో తను ఒకడిగా చేరిపోయాడని చెప్పొచ్చు.

పుష్ప-1, పుష్ప-2 (Pushpa 2) తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సుక్కు నెక్స్ట్ రామ్ చరణ్ తో తీయబోయే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని ప్రేక్షకులు ఊహించుకుంటున్నారు. బాక్సాఫీస్ ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. రామ్ చరణ్ సుక్కు కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం మూవీ ఎంత పెద్ద హిట్టు కొట్టిందో తెలిసిందే. నెక్స్ట్ సినిమా మాత్రం అంతకుమించి ఉంటుందని తెలుస్తోంది.

తన 20 ఏళ్ల కెరియర్ లో పట్టుమని 10 సినిమాలు కూడా తీయని ఈ లెక్కల మాస్టర్ (Director Sukumar ) ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తనదైన ముద్ర వేశాడు.నేడు 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సుక్కు మునుముందు మరిన్ని అద్భుతాలు చేయాలని కోరుకుందాం.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?