Hyderabad : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (BRS working president KTR)కు మళ్లీ నిరశే ఎదురైంది. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) ఈ రోజు తిరస్కరించింది. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్ ఆశ్రయించగా ఆయన అభ్యర్థనను సుప్రీం కొట్టివేసింది.
హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని..
కేటీఆర్ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తులు బేలా ఎం.త్రివేది (Justices Bela M Trivedi), పి.బి.వరాలే (PB Varale)తో కూడిన ధర్మాసనం దానిని తిరస్కరించింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు ముందుగానే తిరస్కరించన విషయం విదితమే. హైకోర్టు (Telangana High Court) జారీ చేసిన ఉత్తర్వులలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో లోతైన విచారణ జరగాల్సి ఉందని సుప్రీం అభిప్రాయపడింది.
తీవ్ర వాదోపవాదాల తర్వాత
కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే న్యాయస్థానంలో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి హాజరయ్యారు. ఈ కేసును ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని దవే కోరగా రోహత్గి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరి వాదోపవాదాలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు Supreme Court ప్రకటించింది.
KTR కి మళ్లీ చెక్కెదురు
కేటీఆర్ (KTR ) మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏ అండ్ యూడీ) మంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో ఫార్ములా -ఈ కార్ రేసు (Formula E CAR RACE) ఈవెంట్ జరిగింది. దీని నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. దీంతో హైకోర్టులో జనవరి 7న క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు దానిని తిరస్కరించింది. ఆ తర్వాత కేటీఆర్ సుప్రీంను ఆశ్రయించగా అక్కడా ఆయనకు చుక్కెదురైంది. ఈసారి కూడా ఆయన నిరాశే ఎదురైంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







