UP Police Encounter News : ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF )తో జరిగిన ఎన్కౌంటర్లో ఓ కరుడుగట్టిన నేరస్తుడితోపాటు అతని ముగ్గురు సహచరులు హతమయ్యారు. సదరు గ్యాంస్టర్ పై ఇప్పటికే లక్ష రూపాయల రివార్డు ఉంది. ఈ మేరకు మంగళవారం అధికారులు మీడియాకు వివరాలు వెల్లడించారు. సోమవారం, మంగళవారం మధ్య రాత్రి షామ్లీలోని జింఝానా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక STF ఇన్స్పెక్టర్కు కూడా అనేక బుల్లెట్లు తగిలి గాయాలపాలయ్యారు.
STF అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) అమితాబ్ యాష్ ఒక ప్రకటనలో, “సోమవారం అర్దరాత్రి,STF మీరట్ బృందంతో జరిగిన ఎన్కౌంటర్లో, ముస్తఫా కగ్గా గ్యాంగ్ సభ్యుడు అర్షద్‌తోపాటు అతని ఇతర ముగ్గురు సహచరులు మంజీత్, సతీష్, మరో గుర్తు తెలియని మృతిచెందారు.
అడిషనల్ డిజిపి అమితాబ్ యష్ మాట్లాడుతూ, “సహారన్‌పూర్‌లోని బెహత్ పోలీస్ స్టేషన్లో నమోదైన దోపిడీ కేసులో అర్షద్ ప్రధాన నిందితుడు. అతనిపై మీరట్ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ రూ.లక్ష రివార్డు ప్రకటించారు. అర్షద్‌పై సుమారు 12 కేసులు నమోదయ్యాయి. కాగా ఎస్టిఎఫ్ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఇన్స్పెక్టర్ సునీల్‌ను ఎన్కౌంటర్ (Police Encounter) సమయంలో అనేక బుల్లెట్లు తగిలాయి. మొదట హర్యానాలోని కర్నాల్‌లోని అమృతధార ఆసుపత్రిలో చేర్చారని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి రెఫర్ చేశారు. గాయపడిన ఇన్స్పెక్టర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..