KCR | బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనదైన శైలిలో సంచనల వ్యాఖ్యలు చేశారు. ‘నేను కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం నా అలవాటు లేదు కదా.. అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం జహీరాబాద్ బీఆర్‌ఎస్ నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు ఏమంత్రం సంతోషంగా లేదని అన్నారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని చెప్పారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్లు కనబడితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చిందడంతో కార్యకర్తలు జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
తులం బంగారం కోసం ఆశపడి ఓటేశారు : KCR
ఎన్నికల సమయంలో తాను చెప్పినా ప్రజలు వినలేదని.. తులం బంగారం కోసం అత్యాశకు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారని మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) పేర్కొన్నారు. రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీం చెబుతారని తాను ఎన్నికల సమయంలోనే చెప్పానని తెలిపారు. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కు వోటు వేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో తమదే విజయమని పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు కేసీఆర్.
మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని అన్నారు.
ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిబ్రవరి నెలాఖరులో భారీ సభ పెడుతామని.. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు తరలిరావాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో భూముల ధరలు ఘోరంగా పడిపోయాయన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు అక్కడే ఆగిపోయాయని మండిపడ్డారు. సంగమేశ్వర, బసవేశ్వర, కాళేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారంటూ ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్ అయ్యారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







