Sarkar Live

MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేసింది.. ఈరోజు నుంచే నామినేషన్లు షురూ

MLC Elections In Telangana : తెలంగాణ‌లో రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్ ను జారీ చేసింది. దీంతో సోమ‌వారం నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభించింది. ఈ నెల 10వ తేదీ

Jubilee Hills By Election

MLC Elections In Telangana : తెలంగాణ‌లో రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్ ను జారీ చేసింది. దీంతో సోమ‌వారం నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభించింది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్ల‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు. 11వ‌తేదీన న నామినేష‌న్ల‌ను ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు ఈనెల‌ 13న సాయంత్రం 3 గంటల వరకు తుది గ‌డువు ఉంటుంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను అదే రోజు ప్రకటిస్తారు. ఇక పోలింగ్ ఫిబ్ర‌వ‌రి 27న జరుగుతుంది. వొచ్చేనెల 3న ఓట్ల లెక్కింపు నిర్వ‌హించ‌నున్నారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల (Telangana MLC Elections) నేప‌థ్యంలో ఆయా జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.

MLC Elections Schedule : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదీ..

  • నామినేషన్ ప్రక్రియ: ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు
  • నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 11
  • నామినేషన్ల ఉపసంహరణకు గడువు: ఫిబ్రవరి 13
  • పోలింగ్: ఫిబ్రవరి 27 (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
  • ఫలితాలు: మార్చి 3

Telangana MLC Elections : కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ జిల్లా పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీల స్థానాలు, ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఖాళీ అవుతున్న నేప‌థ్యంలో తాజాగా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. కాగా, ఎన్నికల అధికారులుగా కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, నల్లగొండ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి వ్యవహరిస్తున్నారు. .

ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి నల్లగొండ కలెక్టరేట్‌లో ఎన్నిక‌ల స్వీక‌ర‌ణ ప్రక్రియ ప్రారంభ‌మైంది. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 24,905 మంది ఓటర్లు ఉన్నారు. 191 మండలాల్లో 200 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది ఎన్నికల‌ సంఘం.

ఇక ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 3,41,313 మంది త‌మ ఓటుహ‌క్కును క‌లిగి ఉన్నారు. ఉపాధ్యాయ ఓట్లు 25,921 ఉన్నాయి. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల కోసం 499, ఉపాధ్యాయ ఓటర్లకు 274 చొప్పున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?