Thandel Review in telugu : అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి (Naga chaithanya, Sai pallavi) జంటగా నటించిన మూవీ తండేల్ (Thandel). కార్తికేయ-2 మూవీతో డైరెక్టర్ గా మంచి హిట్ అందుకున్న చందు మొండేటి (Chandhu mondeti) ఈ మూవీని డైరెక్ట్ చేశారు. బడా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు(banny vasu) మూవీని నిర్మించారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు పాకిస్థాన్ కోస్టల్ గర్డ్స్ కి చిక్కి జైలులో ఉంటాడు. అక్కడి నుంచి బయటపడి తన ప్రేయసిని ఎలా కలుసుకుంటాడనేది కథ. రియల్ స్టోరీని ఆధారంగా చేసుకుని తీసిన ఈ మూవీ (Thandel Review) ఈ రోజే విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
Thandel Review : ఆద్యంతం ఆకట్టుకునేలా ..
నాగచైతన్య, సాయి పల్లవి ఇదివరకు శేఖర్ కమ్ముల (Shekhar kammula) డైరెక్షన్ లో లవ్ స్టోరీ(Love Story) అనే మూవీ తీశారు. ఆ మూవీలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తండేల్ మూవీలో కూడా ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే వీరి కెమిస్ట్రీ కుదిరింది. రాజు, సత్యగా వీరిద్దరూ పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు. ఫస్టాఫ్ కొద్దిగా స్లోగా వెళుతున్నట్టుగా అనిపించినా సాయిపల్లవి, నాగచైతన్య మధ్యలో వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. నాగచైతన్య మత్స్యకారుడు పాత్రలో ఒదిగిపోయారు. తన గత చిత్రాలు కస్టడీ , థాంక్యూ ఆశించినంతగా ఆడలేదు. ఈ మూవీతో ఆయనకు మంచి హిట్టు దక్కుతుందనిపిస్తోంది. రాజు కేరక్టర్ తన కెరియర్ లో గుర్తుండిపోతుంది. సాయి పల్లవికి అమరన్ తో ఎంత పేరొచ్చిందో తెలిసిందే. ఈ మూవీలో కూడా సత్య కేరక్టర్ తో ఆడియన్స్ ని కట్టిపడేసింది. నటనలో మరో మెట్టు ఎక్కింది. మిగితా ఆర్టిస్టులు కూడా వారి పాత్రల మేరకు నటించారు.
లవ్ స్టోరీని, దేశభక్తిని రెండింటిని బ్యాలెన్స్డ్ గా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.కానీ డైరెక్టర్ చందు మొండేటి సెకండాఫ్ లో వచ్చే పాకిస్థాన్ జైలు ఎపిసోడ్స్ నేచురల్ గా తీయలేదనిపించింది. కొన్ని సాగదీత సీనులతో బోర్ గా అనిపించినా సినిమాకు పెద్దగా మైనస్ కాదని అనిపించింది.
ఇటువంటి లవ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే మూవీలో ఎమోషనల్ సీన్స్ హత్తుకునేలా ఉంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ మూవీలో అటువంటి సీన్స్‌లో ఆడియన్స్ ని కంట తడి పెట్టించాడు. ఇదే మూవీకి ప్రధాన బలంగా మారింది. సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ తడబడినట్టుగా అనిపించినా ఆఖర్లో మళ్లీ స్టోరీ పై పట్టు వదలకుండా కరెక్ట్ ఎండ్ ఇచ్చాడు.
Thandel Review : ఇటీవల కాలంలో దేవి శ్రీ ప్రసాద్(DSP) మునుపటిలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వట్లేదని విమర్శలు వచ్చాయి. వాటికి చెక్ పెట్టినట్టుగా తన అద్భుతమైన మ్యూజిక్ తో వింటేజ్ డిఎస్పి ని ఈ మూవీలో చూపించాడు. అన్ని పాటలు ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఎలివెట్ చేశాయి. ప్రేమకథ లకు డీఎస్పీనే కరెక్ట్ ఆప్షన్ అనుకునేలా మరోసారి నిరూపించుకున్నాడు.మొత్తానికి తండేల్ మూవీ ఆడియన్స్ ని మెప్పించిందనే చెప్పుకోవచ్చు….
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








1 Comment
[…] తండేల్ లో నాగచైతన్య, సాయి పల్లవి నటనతో అదరగొట్టేస్తే ఆ తర్వాత క్రెడిట్ మొత్తం డీఎస్పీకే చెందుతుంది. ఎందుకంటే తన వింటేజ్ మ్యూజిక్ తో మూవీస్ లోని సీన్స్ ని చాలా ఎలివేట్ చేశాడు. మూవీ స్టార్టింగ్ లో సాయి పల్లవి ఎంట్రీ సీన్ దగ్గర నుండి దాదాపు నాలుగు నిమిషాల పాటు తనిచ్చిన బిజిఎం ఒక్కసారిగా సొంతం, కలుసుకోవాలని, ఆనందం మూవీస్ లో బిజీఎం ఎలా ఉందో అలా ఒక్కసారిగా 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లాడు. […]