Sarkar Live

Nayanthara | మలయాళ మెగాస్టార్ తో లేడీ సూపర్ స్టార్

Mollywood film industry News | లేడీస్ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయినా హీరోయిన్ గా అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు. రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ్,

Nayanthara

Mollywood film industry News | లేడీస్ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయినా హీరోయిన్ గా అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు. రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో అగ్రకథానాయికగా వెలుగొందుతోనే ఉంది. అన్ని భాషల్లో అందరూ అగ్ర హీరోలతో నటించి బెస్ట్ జోడీ అనిపించుకుంది. అలాగే ఇండస్ట్రీలో తన జూనియర్లతో కూడా నటించి నయన్ బెస్ట్ ఫెయిర్ గా నిలిచింది.

నయన్ లుక్స్, తన గ్లామర్, ఫిజిక్ అటు సీనియర్ హీరోలకు, ఇటు జూనియర్ హీరోల పక్కన చక్కగా సరిపోతుంది. కెరియర్ స్టార్టింగ్ లో యాంకర్ గా మొదలుపెట్టి హీరోయిన్ గా ఎదిగిన నయన్ అప్పటి నుండి ఇప్పటి వరకు తన కెరీర్లో వెనుదిరి చూసుకోలేదు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ దూసుకుపోయింది.ఇప్పుడు కొత్తగా వస్తున్న కుర్ర హీరోయిన్లకు పోటీగా వరుసగా సినిమాల పై సంతకాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

అన్ని భాషల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న నయన్ లేటెస్ట్ గా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Megastar mammutti), మోహన్ లాల్ (Mohan lal) కాంబినేషన్ లో మహేష్ నారాయణ్ (mahesh narayan) డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాలో మెరువనుంది. మమ్ముట్టి తో నయన్ ఇదివరకు 2005లో ప్రమోద్ పప్పన్ డైరెక్షన్లో తస్కర వీరన్,అదే సంవత్సరం కమల్ డైరెక్షన్ లో రాప్పకల్ , 2015 లో సిద్దిక్ డైరెక్షన్ లో భాస్కర్ ది రాస్కెల్ , అలాగే పుతియ నియమం (తెలుగులో వాసుకి పేరుతో) సజన్ డైరెక్షన్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది.

Nayanthara : చాన్స్ కొట్టేసిన నయన్…

ఇప్పుడు మలయాళం లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా రూపొందుతున్న మూవీలో ఛాన్స్ కొట్టేసింది. కొచ్చిలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుండగా లేటెస్ట్ గా నయన్ మూవీ చిత్రీకరణలో అడుగుపెట్టింది. నయన్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఆమె చిత్రీకరణలో పాల్గొన్న కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ బిగ్ మల్టీ స్టారర్ మూవీ కొన్ని రోజులు విదేశాల్లో పూర్తి చేసుకుని కొచ్చికి వచ్చింది. చాలా రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరుపుకుంది. కొచ్చిలో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుందని తరువాత షెడ్యూల్ ఢిల్లీలో జరగబోతున్నట్లు,అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఢిల్లీలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాక షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుందని సినీ వర్గాల టాక్. మమ్ముట్టి, మోహన్ లాల్ చాలా కాలం తర్వాత కలిసి నటిస్తున్నారు. నయనతార (Nayanthara ) తో పాటు ఇంకా కొందరు ప్రధాన తారాగణం ఇందులో భాగమయ్యారు. ఇందులో టాలెంటెడ్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ ,ఆసఫ్ ఆలీ, కొంచకో బోబన్, రేవతి, రంజి పనికర్,రాజీవ్ మీనన్,డానిష్ హుస్సేన్,సిద్ధిక్,సనల్ అమన్, రాజేంద్రన్,షికాబ్,ప్రకాష్ తదితరులు నటిస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?