Bollywood Film Industry | ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో చెప్పలేం. అప్పుడప్పుడు ఊహించని కాంబోలో మూవీస్ సెట్ అవుతుంటాయి.పేరున్న డైరెక్టర్ మూవీలో అవకాశం వేస్తే కథ వినకుండా కూడా డైరెక్టర్ మేకింగ్ మీద నమ్మకంతో బడా హీరో అయినా సరే కమిట్ అయిపోతా ఉంటారు. కొందరు స్టార్స్ అవతల ఉన్నది ఏ హీరో అయినా అందులో తన పాత్ర చిన్నదైనా సరే ఒప్పుకొని సినిమా చేస్తారు. అలా ఓ కాంబినేషన్లో మూవీ రానున్నట్లు, అందులో కింగ్ నాగార్జున (King Nagarjuna) ఒక పాత్ర చేయనున్నట్లు బాలీవుడ్లో వార్తలు (Bollywood News) వినిపిస్తున్నాయి.
మున్నాభాయ్ ఎంబిబిఎస్(Munnabhai MBBS), లగే రహో మున్నాభాయ్ (Lage raho Munnabhai) మూవీస్ ని తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) బాలీవుడ్లో (Bollywood) బడా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పీకే సినిమాతో చరిత్ర సృష్టించాడు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో సినిమా చేయడానికి ఏ హీరో అయినా ఎదురుచూస్తుంటారు. అలాంటి క్యారెక్టర్ ని తన మూవీలో డిజైన్ చేస్తాడు. రెండు దశాబ్దాలకు పైగా సినిమాలను తీస్తున్నా.. ఇతడు డైరెక్ట్ చేసింది కొన్ని సినిమాలు మాత్రమే. సంజయ్ దత్ హీరోగా మోస్ట్ ఎంటర్ టైనర్ మున్నాభాయ్ ఎంబిబిఎస్, లగే రహో మున్నాభాయ్ ఒకదానికి మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. సంజయ్ దత్ కి అప్పటివరకు తనకున్న స్టార్డం కంటే ఈ మూవీస్ చేశాక పదింతలు ఎక్కువ స్టార్ డం పెరిగింది.
ఈ మూవీస్ ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జయంత్ సీ పరాన్జీ డైరెక్షన్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ గా రీమేక్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. దీనికి రెండవ పార్ట్ గా శంకర్ దాదా జిందాబాద్ ప్రభుదేవా దర్శకత్వంలో చేయగా అది పర్వాలేదనిపించింది. ఈ రెండు సినిమాలు, ఇందులోని పాటలు చిరు కెరీర్లో ది బెస్ట్ గా నిలిచిపోయాయి. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ మున్నాబాయి-3 (Munnabhai-3) తీసే ఆలోచనలో ఉన్నారు. ఇదివరకే పలు రకాలుగా కథలను అనుకున్నట్లు కూడా తెలిపారు. ఇప్పుడు ఈ కథ సెట్ అయి సెట్స్ మీదకు తీసుకెళ్లే పనిలో ఉన్న తెలుస్తోంది. రెండు పార్ట్ లు ఆడియన్స్ ఆకట్టుకోగా మున్నాభాయ్ సిరీస్ మూడో భాగానికి మున్నాభాయ్ చలే అమెరికా (Munnabhai chale america) ఉన్న టైటిల్తో రాబోతున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ఎప్పుడు మొదలుపెట్టినా రాజ్ కుమార్ హిరానీ సంజయ్ దత్ (sanjay dhath) ని ఈ మూవీలో ఇంకెలా చూపిస్తాడో అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా మున్నాభాయ్- 3లో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందట. ఆ ఆఫర్ టాలీవుడ్ కింగ్ నాగార్జున కి వరించినట్టు బాలివుడ్ టాక్. రాజ్ కుమార్ హిరాణి సినిమాలో చిన్న పాత్ర అయినా సరే ఏ హీరో అయినా సరే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేస్తే నటుడిగా మరో మెట్టు ఎక్కేలానే డిజైన్ చేస్తారు హిరానీ. అలాంటిది కింగ్ నాగార్జున కి కేరక్టర్ రాస్తే మాములుగా అయితే ఉండదు.
కింగ్ నాగార్జున కు వేరే హీరో సినిమాలో నటించడం కొత్తమీ కాదు. గతంలో కూడా చాలా సినిమాల్లో చేశాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ హీరోగా కుబేర ,అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో వస్తున్న కూలి అనే మూవీలో కూడా కింగ్ నటిస్తున్నారు. కాబట్టి రాజ్ కుమార్ హిరాణి సంజయ్ దత్ కాంబోలో వస్తున్న ప్రాజెక్టులో నాగ్ నటిస్తే అక్కినేని అభిమానులకు పండుగే. ఈ వార్తలపై మూవీ టీం అఫీషియల్ గా ప్రకటించలేదు. ఏదైనా మున్నాబాయ్ సిరీస్ లో సినిమా వస్తుండడం, అందులో నాగ్ నటిస్తున్నట్టు వస్తున్న వార్తలపై మూవీ లవర్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








2 Comments
[…] బాలీవుడ్ లో ఖాన్ల త్రయందే హవా. వారి తర్వాత బాలీవుడ్ ను ఏలేది ఎవరన్న ప్రశ్నకు సమాధానం విక్కీ కౌశల్ కూడా ఒకడు అని చెప్పొచ్చు. ఈ మూవీకి ముందు యురి, సర్దార్ ఉద్దమ్, శ్యామ్ బహద్దూర్ లాంటి హిట్స్ తన ఖాతాలో ఉన్న టాప్ హీరో అనిపించుకోలేకపోయాడు. కానీ ఛావాతో ఒక్కసారిగా విక్కీ కౌశల్ రేంజ్ మారిపోయింది. ఈ మూవీ రాబడుతున్న వసూళ్లను బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుంది. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ కు ముందు బాలీవుడ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వరుసగా ఇతర భాషలో వచ్చిన మూవీ స్ అన్నీ బ్లాక్ బస్టర్ లు కొట్టి వెయ్యి కోట్ల మార్క్ ని అందుకుంటుంటే ఒకప్పుడు భారీ కలెక్షన్ల కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న బాలీవుడ్ మాత్రం కొన్ని రోజులుగా వెనకబడిపోయింది. ఆ మధ్య వచ్చిన స్కై ఫోర్స్ మూవీ డిసెంట్ కలెక్షన్స్ అందుకోగా ఛావా రికార్డ్ లు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. […]
[…] బాలీవుడ్ నటి (Bollywood actress) హైదరాబాద్లోని ఓ వాణిజ్య సంస్థ […]