Sarkar Live

Allu Arjun | అల్లు అర్జున్, త్రివిక్రమ్ మధ్యలో అట్లీ…?

పుష్పతో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) తర్వాత ఏ సినిమా చేస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్లో తన తర్వాతి మూవీ చేయనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ కూడా

Allu Arjun

పుష్పతో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) తర్వాత ఏ సినిమా చేస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్లో తన తర్వాతి మూవీ చేయనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ కూడా స్పష్టత లేదు. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నా మూవీ టీం ఇంకా ఫైనలైజ్ అయినట్లు ప్రకటించలేదు. పుష్ప-2కు ముందే అట్లీ (Atlee) డైరెక్షన్లో అల్లు అర్జున్ మూవీ చేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది పట్టాలకెక్కలేదు. దీంతో అల్లు అర్జున్ వేరే సినిమాలకు కమిట్ అయ్యాడు. అట్లీ కూడా తన సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప -2 (Pushpa-2) బిగ్గెస్ట్ హిట్టు తో తన రేంజ్ మారిపోయింది. అట్లీ కూడా షారుక్ ఖాన్ (sharukh Khan) హీరోగా జవాన్ మూవీ తీసి వరల్డ్ వైడ్ గా స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో మూవీ చేయడానికి ఏ హీరో అయినా ఒకే చెప్తాడు. అల్లు అర్జున్, అట్లీ ఇద్దరు కూడా కెరియర్ లో టాప్ లో ఉన్నారు. ఈ జోడీ కలిస్తే మూవీ వరల్డ్ వైడ్ గా బిగ్గెస్ట్ హిట్టు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

అల్లు అర్జున్ కు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఈ టైమ్ లో చేయడం సరైనది కాదని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు గురూజీ డైరెక్షన్ లో పాన్ ఇండియా లెవెల్ లో ఒక్క మూవీ కూడా తెరకెక్కలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ తో తీయబోయేది మాత్రం పాన్ ఇండియన్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్ పైనే వర్క్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ పనులు ఫైనలైనట్లు టాలీవుడ్ టాక్. హారిక హాసిని క్రియేషన్స్ అలాగే గీత ఆర్ట్స్ బ్యానర్ పై మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. కాకపోతే అల్లు అర్జున్ ముందు ఏ డైరెక్టర్ సినిమాను చేయాలో తెలియక తికమకపడుతున్నారట.

అట్లీ డైరెక్షన్ లోనే Allu Arjun మూవీ..?

ఇప్పడు తనకున్న క్రేజ్ ఆలోచించుకుని అట్లీ డైరెక్షన్ లోనే మూవీ చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలుస్తోంది. ఒకవేళ త్రివిక్రమ్ మూవీ కంప్లీట్ చేశాకనే చేయాలనుకుంటే అట్లీ సల్మాన్ ఖాన్ తో మూవీ చేయడానికి కమిట్ అవుతాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మురుగదాస్ డైరెక్షన్లో సికిందర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అల్లు అర్జున్ తో మూడు హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ (Allu Arjun With trivikram ) తోనే ప్రొసీడ్ అయితే అట్లీ సల్మాన్ ఖాన్ తో మూవీ స్టార్ట్ చేస్తాడు. అలా కాకుండా అట్లీతోనే సినిమా చేయాలనుకుంటే త్రివిక్రమ్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఇప్పట్లో లేదనుకోవచ్చు. ఎందుకంటే అట్లీ తో మూవీ అంటే ఒక సంవత్సరం పైనే పడుతుంది. ఈ మూవీ పూర్తి చేశాక ఎలాగో పుష్ప -3 ఉండనే ఉంది. సుకుమార్ తో సినిమా అంటే రెండు సంవత్సరాలు ఈజీగా పడుతుంది. ఈ మూవీస్ పూర్తయ్యే వరకు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. త్రివిక్రమ్ పాన్ ఇండియన్ మూవీ కల నెరవేరాలంటే ప్రజెంట్ తన చేతిలో ఉన్న అల్లు అర్జున్ ని వదలకూడదు. వీరి కాంబినేషన్లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో వరుస హిట్స్ కొట్టారు. అలా వీరి మధ్య రాపో బాగుంటుంది.

మిస్ అయితే అంతే ఇక…

ఇప్పుడు ఈ అవకాశం మిస్ అయితే మాత్రం వేరే హీరోతో పాన్ ఇండియన్ మూవీ అంటే కష్టమే. టైర్ వన్ హీరోలంతా వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇంకా రెండు మూడు సంవత్సరాల పాటు వారు ప్రాజెక్ట్స్ ని సెట్ చేసి పెట్టుకున్నారు. త్రివిక్రమ్ మూవీ ఇప్పుడు అల్లు అర్జున్ (Allu Arjun ) చేతుల్లో ఉంది. ప్రాజెక్ట్ పట్టాలకెక్కితే మాత్రం గురూజీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. చూడాలి మరి అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ కు ఓటు వేస్తారో….


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

One thought on “Allu Arjun | అల్లు అర్జున్, త్రివిక్రమ్ మధ్యలో అట్లీ…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!