TGANB | హైదరాబాద్ నగరంలో డ్రగ్ (Drugs) కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నగరంలోని హై ఎండ్ పార్టీలు (High-End Party), ప్రైవేట్ ఈవెంట్స్ కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ఆదివారం అర్థరాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వద్ద జరిగిన ఒక హైఎండ్ పార్టీపై హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) సంయుక్త ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఇందులో పలువురు ప్రముఖులు పట్టుబడ్డారని తెలిసింది.
14 మందికి డ్రగ్స్ నిర్ధారణ?
ఒక విశ్వసనీయ సమాచారం ఆధారంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఓ విల్లాలో జరుగుతున్న హై ఎండ్ పార్టీపై పోలీసులు ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో దాడి చేశారు. మొత్తం 20 మంది డ్రగ్ వినియోగదారులను గుర్తించారని తెలిసింది. వీరిలో ఎక్కువ మంది నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, విదేశీయులు ఉన్నట్లు పోలీసులు తేల్చారని సమాచారం.
డ్రగ్ టెస్టింగ్‌లో అధునాతన సాంకేతికత
ఈ దాడుల్లో చిక్కిన వారిని పోలీసులు అధునాతన టెక్నాలజీ (Advanced Drug Testing) ద్వారా పరీక్షించారు. ప్రధానంగా డ్రగ్ డిటెక్షన్, రాపిడ్ రిజల్ట్ కిట్లను వినియోగించారు. ఇవి అత్యంత శక్తిమంత పరీక్షలు. పట్టుబడిన వ్యక్తులు మాదకద్రవాలు తీసుకున్నట్టు వెంటనే గుర్తించేందుకు వీటిని ఉపయోగిస్తారు. మూత్రం, లాలాజలం పరీక్షించి నిర్ధారిస్తారు. ఈ కేసులో కూడా ఇలాంటి టెస్టులు చేయగా డ్రగ్ తీసుకున్నట్టు ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది.
హెచ్చరికలు జారీ చేసిన TGANB
డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పబ్‌లు, బార్లలో Drug-Free Zone అనే బోర్డులు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. తమ ఆవరణలో డ్రగ్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని ఆ బోర్డులపై బార్లు, పబ్‌ల నిర్వాహకులు పేర్కొనాలని సూచించింది.
ఆన్‌లైన్‌లో డ్రగ్స్ ఆర్డర్
హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని మాదక ద్రవ్యాల కేంద్రంగా మార్చడానికి అంతర్జాతీయ డ్రగ్ మాఫియా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక్కడికి నైజేరియన్ ముఠాలు గంజాయి, కొకైన్ సరఫరా చేస్తున్నాయని, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నారని అంటున్నారు.
ఇంటర్నెట్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసి, హోం డెలివరీ వంటి కొత్త మార్గాలను ఈ మాఫియా ఉపయోగిస్తోందని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







