Sarkar Live

Mechanical Elephants | ఇక ఉత్స‌వాల్లో కృత్రిమ ఏనుగులు.. PETA ప్ర‌తిపాద‌న‌

Mechanical Elephants : కేరళ (Kerala)లో ఇటీవల ఏనుగు దాడులు పెరిగాయి. దీంతో అనే మంది ప్రాణాల‌ను కోల్పోయారు. చాలామంది గాయ‌ప‌డ్డారు. ఆలయాలు, ప్రార్థ‌న స్థ‌లాల్లో జ‌రిగే పండుగ‌ల సమయంలో ఈ దుర్ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్ ఫర్

Elephants

Mechanical Elephants : కేరళ (Kerala)లో ఇటీవల ఏనుగు దాడులు పెరిగాయి. దీంతో అనే మంది ప్రాణాల‌ను కోల్పోయారు. చాలామంది గాయ‌ప‌డ్డారు. ఆలయాలు, ప్రార్థ‌న స్థ‌లాల్లో జ‌రిగే పండుగ‌ల సమయంలో ఈ దుర్ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (PETA) ఇండియా అనే జంతు హక్కుల సంస్థ ఒక ప్రత్యేక ప్రతిపాదనతో ముందుకొచ్చింది.

నిజ‌మైన ఏనుగుల్లా Mechanical Elephants

ఉత్స‌వాల్లో ఏనుగుల‌ను వినియోగించ‌డం వల్ల శారీర‌క‌, మాన‌సిక ఒత్తిడి పెరిగి అవి విచ‌క్ష‌ణ కోల్పోయి హింసాత్మ‌కంగా మారుతున్నాయ‌ని PETA అంటోంది. వాటి స్థానంలో కృత్రిమ ఏనుగుల‌ను వినియోగించాల‌ని కోరింది. అచ్చం అస‌లైన ఏనుగుల్లా జీవం ఉట్టిప‌డే విధంగా ఇవి ఉంటాయ‌ని తెలిపింది. ఈ యాంత్రిక (కృత్రిమ‌) ఏనుగుల‌ను తాము స‌మ‌కూర్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని PETA అంటోంది. అయితే.. దానికి ఒక ష‌ర‌తు విధించింది. ఉత్స‌వాల‌కు వినియోగించే నిజ‌మైన ఏనుగుల‌ను సంకేళ్లు లేకుండా స్వేచ్ఛ‌గా జీవించేలా సంర‌క్ష‌ణ కేంద్రాల‌కు త‌ర‌లించాల‌ని కండీష‌న్ పెట్టింది. అంతేకాదు.. భ‌విష్య‌త్తులో ఎప్ప‌టికీ నిజ‌మైన ఏనుగుల‌ను ఉప‌యోగించ‌బోమ‌ని హామీ కూడా ఇవ్వాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.

వ‌రుస ఘ‌ట‌న‌లు ఇలా..

పండుగలు, ఊరేగింపుల సమయంలో పెద్ద శబ్దాలు, ట్రాఫిక్, ట‌పాసుల హోరు ఏనుగులను భయపెడతాయి. పైగా సంకెళ్లతో నియంత్రించ‌డం వాటిని బాధ క‌లిగిస్తుంది. ఇటీవల పండుగల సమయంలో ఏనుగులు హింసాత్మకంగా మారాయి. దీంతో అనేక అపశ్రుతులు, విషాదాలు చోటుచేసుకున్నాయి. త్రిస్సూర్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఒక ఏనుగు ఓ వ్యక్తిని చంపింది. పాలక్కాడ్‌లో ఒక ఏనుగు తన సంరక్షకుడినే తొక్కి చంపింది. దుకాణాలు, వాహనాలను కూడా ధ్వంసం చేసింది. ఒక పండుగ సమయంలో ఓ ఏనుగు బావిలో పడిపోయింది. మరో ఘటనలో రెండు ఏనుగులు ట‌పాసుల‌ శబ్దంతో బెదిరి ఒకదానితో ఒకటి కొట్టాడుకొని ముగ్గురి మరణానికి కార‌ణ‌మ‌య్యాయి.

Mechanical elephants.. పేటా ప్ర‌తిపాద‌న‌

ఈ వ‌రుస ఘ‌ట‌న‌ల నేపథ్యంలో పేటా కొత్త‌గా ప‌రిష్కార మార్గాన్ని చూపిస్తోంది. నిజ‌మైన ఏనుగుల స్థానంలో యంత్రంతో న‌డిచే కృత్రిమ ఏనుగుల‌ను ఉప‌యోగించాల‌ని ఉత్స‌వాల నిర్వాహ‌కుల‌కు సూచిస్తోంది. ఆ ఏనుగుల‌ను తామే స‌మ‌కూర్చుతామ‌ని కూడా చెబుతోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!