Sarkar Live

Amir of Qatar visit | హైద‌రాబాద్ భ‌వ‌న్‌లో ఖ‌తార్ అధ్య‌క్షుడు, మోదీ.. కీల‌క ఒప్పందాలు

Amir of Qatar visit : ఖతార్ అమీర్ (అధ్య‌క్షుడు) తమీమ్ బిన్ హమాద్ అల్-థానీ (Qatar Amir Tamim Bin Hamad Al-Thani)తో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ

Amir of Qatar visit

Amir of Qatar visit : ఖతార్ అమీర్ (అధ్య‌క్షుడు) తమీమ్ బిన్ హమాద్ అల్-థానీ (Qatar Amir Tamim Bin Hamad Al-Thani)తో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ సంద‌ర్భంగా ప‌లు ఒప్పందాలు జ‌రిగాయి. భారత్-ఖతార్ ద్వైపాక్షిక సంబంధాల‌ను మ‌రింత ప‌టిష్ట ప‌ర్చేలా కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగాయి.

Amir of Qatar visit : స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికిన మోదీ

ఈ సమావేశానికి ముందు ఖతార్ అమీర్‌కు రాష్ట్రపతి భవన్‌లో గౌర‌వ వంద‌నం ల‌భించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సాధారణంగా విదేశీ నేతలను స్వాగతించడం కోసం ప్రొటోకాల్‌ ప్రకారం ముఖ్యమైన అధికారులు లేదా మంత్రులు విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. అయితే.. ఈసారి ప్రధాని మోదీ స్వయంగా ఖతార్ అమీర్‌ను స్వాగతించడానికి విమానాశ్రయానికి వెళ్లారు. తన సోదరుడికి స్వాగతం పలుకుతున్నానని, ఆయన భారత పర్యటన సఫలమవుతుందని ఆశిస్తున్నానని సోషల్ మీడియాలో మోదీ పేర్కొన్నారు.

రెండు దేశాల మ‌ధ్య ప‌టిష్ట సంబంధాఆలు

భారత్, ఖతార్ మధ్య ప‌టిష్ట సంబంధాలు సుదీర్ఘమైనవి. ఇరు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, శక్తి, సాంస్కృతిక మార్పిడి వంటి అనేక రంగాల్లో సహకారం కొనసాగిస్తున్నాయి. ఖతార్‌లో సుమారు 7 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇది ఖతార్‌లోని అతిపెద్ద విదేశీ సముదాయంగా ఉంది. ఇది ఖతార్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.

ఒప్పందాలు ఏం జ‌రిగాయి?

ఇటీవల భారత్, ఖతార్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. ఖతార్ నుంచి భారత్‌కు ప్రధానంగా ధ్రువీకృత సహజ వాయువు (LNG), పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతి చేయబడుతున్నాయి. ఇది భారతకు ఇంధ‌న అవసరాలను తీర్చడంలో కీలకంగా ఉంది. అదేవిధంగా భారత్ నుంచి ఖతార్‌కు ఆహార పదార్థాలు, టెక్స్‌టైల్, ఇతర వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. తాజాగా ప్ర‌ధాని మోదీ, ఖ‌తార్ అమీర్ మ‌ధ్య జ‌రిగి భేటీలో ఇరు దేశాల నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధ‌నం, సాంకేతికత వంటి రంగాల్లో సహకారాన్ని మరింతగా విస్తరించ‌డంపై చర్చించారు.

ఇరు దేశాలు సాంస్కృతిక కార్యక్రమాలు, విద్య, పర్యాటక రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భారత్-ఖతార్ సంబంధాలు కేవలం వాణిజ్యం, పెట్టుబడులకే పరిమితంగా కాకుండా ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా సహకారం కొనసాగిస్తున్నాయి. ఇరు దేశాలు భద్రత, ఉగ్రవాద నిరోధం, శాంతి స్థాపన వంటి అంశాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకుంటున్నాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!