Sarkar Live

Centre to help red chilli farmers | ఏపీ మిర్చికి మ‌ద్ద‌తు ధ‌ర.. శుభ‌వార్త చెప్పిన కేంద్రం

Centre to help red chilli farmers : ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతుల (chilli farmers)కు కేంద్రం శుభ‌వార్త చెప్పింది. మార్కెట్‌లో ధ‌ర పడిపోతున్న దృష్ట్యా వారికి బాస‌ట‌గా నిలిచేందుకు నిర్ణ‌యించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం అభ్య‌ర్థన మేర‌కు కేంద్రం మార్కెట్ ఇంట‌ర్వెన్ష‌న్

chilli farmers

Centre to help red chilli farmers : ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతుల (chilli farmers)కు కేంద్రం శుభ‌వార్త చెప్పింది. మార్కెట్‌లో ధ‌ర పడిపోతున్న దృష్ట్యా వారికి బాస‌ట‌గా నిలిచేందుకు నిర్ణ‌యించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం అభ్య‌ర్థన మేర‌కు కేంద్రం మార్కెట్ ఇంట‌ర్వెన్ష‌న్ స్కీం (MIS) ద్వారా మ‌ద్ద‌తు ధ‌ర కల్పించ‌నుంది. ఈ మేర‌కు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ చౌహాన్ (Union Agriculture Minister Shivraj Singh Chouhan) ప్ర‌క‌టించారు.

సీఎం చంద్రబాబు విజ్ఞప్తిపై సానుకూల స్పందన

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మిర్చి రైతుల (chilli farmers) కు స‌హాయం అందించాల‌ని కేంద్రాన్ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు (Chief Minister N Chandrababu Naidu) కోరారు. ఈ క్ర‌మంలో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ చౌహాన్‌తో చ‌ర్చించారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ ఏపీ రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌ని, వారికి MIS ద్వారా బాస‌ట‌గా నిలుస్తామ‌ని చెప్పారు.

మిర్చి ఎగుమతులకు ప్రోత్సాహం

ఏపీ రైతుల‌ను ఆదుకొనేందుకు మిర్చి పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర కల్పించ‌డ‌మే కాకుండా ఎగుమ‌తుల‌ను పెంచేలా కేంద్రం ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని చౌహాన్ చెప్పారు, మ‌న భార‌త‌దేశ ఎర్ర మిర్చికి అంత‌ర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంద‌న్నారు. విదేశీ మార్కెట్‌ను ల‌క్ష్యంగా చేసుకొని మిర్చి ఎగుమ‌తుల‌ను పెంచేలా ప్రోత్స‌హిస్తున్నామ‌ని అన్నారు.

ICAR బృందాల ద్వారా పంట‌ల ప‌రిశీల‌న‌

ఏపీ మిర్చి ఉత్ప‌త్తి, ఖ‌ర్చు త‌దిత‌ర అంశాల‌ను స‌మీక్షించి నివేదిక అందించాల‌ని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రీసెర్చ్ (ICAR) అధికారులను కేంద్ర మంత్రి చౌహాన్ ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా 2024-25 సీజన్‌కు సంబంధించి MIS కింద రైత‌లకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో మిర్చి పంట‌ల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించేందుకు
ICAR నిపుణుల బృందం ప‌ర్య‌టించ‌నుంది. .

మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (MIS)” అంటే ఏమిటి?

మార్కెట్ ఇంట‌ర్వెన్ష‌న్ స్కీమ్ (Market Intervention Scheme (MIS) అనేది ప్రధానంగా పరిషిష్టమైన (పెరిషబుల్) వ్యవసాయ, తోటల పంటల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకం. మ‌ద్తుతు ధ‌ర (MSP) ల‌భించ‌ని పంట‌ల‌కు MIS వ‌ర్తిస్తుంది. ఒక రాష్ట్రంలో గ‌త సీజ‌న్‌తో పోల్చితే మార్కెట్ ధ‌ర‌లు 10 శాతం ప‌డిపోయిన‌ట్ల‌యితే ఈ MISను అమ‌లు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్రం మద్దతు ధర అందిస్తుంది. అయితే.. MISలో కొత్త మార్పులు చోటుచేకున్నాయి. ప్రస్తుతం దీని కింద 25 శాతం ఉత్ప‌త్తికి మాత్ర‌మే మద్దతు ధ‌క అందిస్తున్నారు. ఈ నేప‌థ్యం ఆంధ్ర‌ప్ర‌దేశ్ విషయంలో కేంద్ర మంత్రి చౌహాన్ మ‌రో అడుగు ముందుకు వేశారు. ఎంఐఎస్ ప‌రిమితిని పెంచేలా ప్ర‌తిపాద‌న‌లు కూడా త‌యారు చేసి నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?