Skip to main content

Sarkar Live

kubera : కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్….

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా వస్తున్న మూవీ కుబేర (kubera). సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావ్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekar Kammula) దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ధనుష్(Dhanush), నాగార్జున (Nagarjuna)

kubera

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా వస్తున్న మూవీ కుబేర (kubera). సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావ్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekar Kammula) దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ధనుష్(Dhanush), నాగార్జున (Nagarjuna) నటిస్తుండగా రష్మిక మందన్న (Rashmika mandhana) హీరోయిన్ గా నటిస్తోంది. టాప్ యాక్టర్స్ ఉండడంతో ఈ మూవీపై మొదటి నుండి కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

ధనుష్ మూవీ అంటేనే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఉంటుంది. అందులో ధనుష్ తో ఊహించని విధంగా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయడంతో మూవీపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెరిగింది. ఎందుకంటే శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, లవ్ స్టొరీ లాంటి ఫీల్ గుడ్ మూవీస్ తీసి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.అలాగే లీడర్ మూవీ తీసి సోషల్ మెసేజ్ మూవీ కూడా బాగా తేయగలడనే పేరు కూడా తెచ్చుకున్నాడు.ఇప్పుడు తీస్తున్న కుబేర కూడా సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత శేఖర్ కమ్ముల అలాంటి జానర్ లో మూవీ తీస్తున్నాడు.

అదిరిపోయే క్యారెక్టర్లు..

ఈ మూవీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చిన మూవీ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీలో క్యారెక్టర్ లను ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లింప్స్ చూస్తే ధనుష్ తన కెరీర్లో ఎప్పుడు చేయనటువంటి పాత్రను చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే నాగార్జున కూడా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో కనబడుతున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ అదిరిపోతాయని మూవీ మేకర్స్ హింట్స్ ఇస్తున్నారు.

kubera : జూన్ 20న రిలీజ్…

ఇక మూవీకి సంబంధించి లేటెస్ట్గా మూవీ టీం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో వచ్చింది. ఈ మూవీని జూన్ 20న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అందులో నాగార్జున ,ధనుష్ ఎదురెదురుగా ఉన్నారు. మధ్యలో బాలీవుడ్లో మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకున్న జిమ్ సర్బ్ నిలబడి ఉన్నారు. వీరి ముగ్గురు పాత్రల చుట్టూ సినిమా నడుస్తుందని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఒక బిచ్చగాడు ధనవంతుడుగా మారగా అతనికి ఎదురయ్యే పరిస్థితులు ఏంటనేది ఈ మూవీ కథగా తెలుస్తోంది. బిచ్చగాడు పాత్రలో ధనుష్, అధికారి పాత్రలో నాగార్జున యాక్ట్ చేసినట్లు కనబడుతోంది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా పుష్ప -2, తండేల్ తో ఆల్రెడీ రెండు భారీ హిట్స్ అందుకున్న దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించడంతో మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ జూన్ 20న రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?