డైరెక్టర్ కరుణాకరన్ ని (Karunakaran)ఈతరం ప్రేక్షకులు మరిచిపోవచ్చేమో కానీ తొలిప్రేమ సినిమా డైరెక్టర్ అంటే టక్కున గుర్తొస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన తొలిప్రేమ (Tholiprema) మూవీతో ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసిన కరుణాకరన్ లవ్ స్టోరీస్ తీయడంలో మాస్టర్ అని చెప్పుకోవచ్చు. తొలిప్రేమ హిట్ తర్వాత సుమంత్ తో యువకుడు మూవీ తీసి హిట్టు కొట్టారు. ఆ తర్వాత తెలుగులో బాలు, వాసు, హ్యాపీ,ఉల్లాసంగా ఉత్సాహంగా తీసి సూపర్ డైరెక్టర్ అనిపించుకున్నాడు.
ప్రభాస్ తో డార్లింగ్ ఆఖరు హిట్టు
ప్రభాస్ తో (Prabhas) తీసిన డార్లింగ్ (Darling) మూవీ తన కెరీర్లో తొలిప్రేమ తర్వాత బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది. ఆ మూవీకి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ మూవీ తర్వాత కరుణాకరన్ కి సరైన హిట్టే పడలేదు. రామ్ తో తీసిన ఎందుకంటే ప్రేమంట స్టోరీ, ప్రజెంటేషన్ బాగున్నా.. ఎందుకో ఆ టైమ్ లో జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆ తర్వాత నితిన్ తో చిన్నదాన నీకోసం, సాయిధరమ్ తేజ్ తో తేజ్ ఐ లవ్ యు లాంటి సినిమాలు తీసి ప్లాపులను ఎదుర్కొన్నాడు. ఆయన తీసిన గత రెండు చిత్రాల్లో ఈయన మార్క్ లేకపోవడంతో జనాలు ఆ మూవీస్ ని పెద్దగా పట్టించుకోలేదు.
తేజ్ ఐ లవ్ యు తర్వాత ఇప్పటివరకు ఏ మూవీ ని కూడా తెరక్కించలేకపోయారు.ఆ మూవీ వచ్చి దాదాపు 7 సంవత్సరాలవుతోంది. ఆల్మోస్ట్ ఇక కరుణాకరన్ దర్శకత్వంలో మూవీ రావడం కష్టమే అనుకున్నారు. కొందరు ఆడియన్స్ మాత్రం తన నుండి మూవీ వస్తె బాగుండని ఎదురుచూశారు. అయితే యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు జోడించి హిట్టు కొట్టే ఈ డైరెక్టర్ ఇప్పుడు దిల్ రాజు బ్యానర్లో ఓ మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది.
Karunakaran Next Movie : ఏప్రిల్ లో స్టార్ట్..?
పకడ్బందీగా కథ లేకపోతే అంత తేలిగ్గా దిల్ రాజు(Dil Raju) ఓకే చేయడు. కరుణాకరన్ (Karunakaran) స్టోరీని ఓకే చేశాడంటేనే ఆ కథలో ఎంత దమ్ముందో అర్థమవుతుంది. ఫ్లాఫ్ లో ఉన్న డైరెక్టర్లకు కూడా దిల్ రాజు ఒక అవకాశం ఇచ్చి చూస్తాడు. అలా అవకాశం ఇచ్చిన డైరెక్టర్లు కూడా మళ్లీ సక్సెస్ బాట పట్టిన వారు చాలామంది ఉన్నారు. ఈసారి ఆయన ఓకే చేసిన స్టోరీ లవ్ స్టోరీ నే అన్నట్టు తెలుస్తోంది. హీరోగా దిల్ రాజు కొడుకు ఆశిష్ (ashish) హీరోగా నటిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. ఆశిష్ లాస్ట్ గా సెల్ఫిష్ అనే మూవీ కొంత భాగం షూటింగ్ చేసుకుని మధ్యలో కొన్ని కారణాలవల్ల ఆపేశారు. ఆ మూవీని తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. అది అలా ఉండగానే ఆశిష్ ఈ మూవీలో యాక్ట్ చేస్తారని తెలుస్తోంది. ఏప్రిల్ నుండి కరుణాకరన్ సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. చాలా రోజుల తర్వాత యాక్షన్ చెప్పబోతున్న కరుణాకరన్ ఈ మూవీతో కచ్చితంగా హిట్టు అందుకుంటారని మూవీ లవర్స్ ఆశిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








1 Comment
[…] గా ఈ మూవీ మొదలుకాకముందే ఫిలింనగర్ నుండి మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. […]