Sarkar Live

Reservation | తెలంగాణ‌లో ఆంధ్ర విద్యార్థుల‌కు రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు

Removes Reservation : తెలంగాణ‌లో ఆంధ్ర‌ప్రదేశ్ విద్యార్థుల‌కు అండ‌ర్ గ్రాడ్యుయేట్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్ర‌వేశం కోసం ఇక రిజ‌ర్వేష‌న్ ఉండ‌దు. తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana govt) తాజాగా ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల (AP students)కు ఇంజినీరింగ్ సహా

Reservation

Removes Reservation : తెలంగాణ‌లో ఆంధ్ర‌ప్రదేశ్ విద్యార్థుల‌కు అండ‌ర్ గ్రాడ్యుయేట్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్ర‌వేశం కోసం ఇక రిజ‌ర్వేష‌న్ ఉండ‌దు. తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana govt) తాజాగా ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల (AP students)కు ఇంజినీరింగ్ సహా అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సుల్లో రిజర్వేషన్‌ను రద్దు చేస్తున్నట్లు (removes reservation) ప్రకటించింది.

Removes Reservation : ఎందుకు ఈ నిర్ణ‌యం?

ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, మెడికల్, డెంటల్ వంటి అనేక ప్రొఫెషనల్ కోర్సుల్లో గతంలో ఉన్న రిజర్వేషన్‌ను పూర్తిగా రద్దు చేయనున్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (Andhra Pradesh Reorganisation Act, 2014) అమల్లోకి వచ్చినప్పుడు రెండు రాష్ట్రాల విద్యార్థులు ప‌దేళ్ల‌పాటు సమాన అవకాశాలతో ప్రవేశాలు పొందేలా నిబంధనలు విధించారు. ఆ కాలపరిమితి పూర్తయింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

కొత్త నిబంధనల ప్రకారం…

  • తెలంగాణ‌లోని యూనివ‌ర్సిటీల పరిధిలోని స్థానిక విద్యార్థులకు 85 శాతం సీట్లు కేటాయిస్తారు.
  • మిగిలిన 15 శాతం సీట్లు గతంలో ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించే వారు. కానీ ఇప్పుడు ఈ సీట్లు ఒకే రకంగా అందరికీ ఓపెన్ అవుతాయి.
  • ఈ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇకపై తెలంగాణలో ప్రత్యేక రిజర్వేషన్ లేకుండా సాధారణ పోటీలో ప్రవేశాలు పొందాలి.
  • ఈ రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దుతో స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యం పెరిగింది. తెలంగాణ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండే కళాశాలల్లో వారు ఎక్కువగా ప్రవేశాలు పొందే అవకాశం ఉంది.

కొత్త నిబంధనలు.. అర్హతా ప్రామాణికాలు

  • విద్యార్థి కనీసం ప‌దేళ్ల‌పాటు తెలంగాణలో నివసించి ఉండాలి. అయితే.. విద్యార్థి చదువు కోసం రాష్ట్రం బయటకు వెళ్లిన సమయాన్ని పరిగణనలోకి తీసుకోరు.
  • తల్లిదండ్రులు తెలంగాణలో ప‌దేళ్ల‌పాటు నివసించి ఉండాలి. ఉద్యోగం నిమిత్తం వారు ఇతర రాష్ట్రాలకు వెళ్లిన కాలాన్ని మాత్రం పరిగణించరు.
  • తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల్లో లేదా విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలు కూడా అర్హులే. Removes Reservation : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులపై ప్రభావం
  • ఈ మార్పుతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణలో ప్రవేశ అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. గతంలో వారి కోసం ప్రత్యేకంగా 15 శాతం సీట్లు కేటాయించేవారు. కానీ ఇప్పుడు అవి ఓపెన్ కేటగిరీకి మార్చడంతో పోటీ మరింత పెరుగుతుంది. ముఖ్యంగా టాప్ ర్యాంక్ సాధించే విద్యార్థులకు మాత్రమే తెలంగాణలో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది.
  • తెలంగాణలో స్థానిక విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ లాంటి ప్రయోజనాలు ఉంటాయి. కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ రాయితీలకు అర్హులు కారు. దీంతో ప్రైవేట్ కళాశాలల్లో చదువుకోవాలంటే అధిక ఫీజు భరించాల్సి ఉంటుంది. తెలంగాణ విద్యార్థులకు ప్ర‌యోజ‌నాలు
  • తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక విద్యార్థులకు మరింత ప్రయోజనం కలిగించేలా ఉంటుంది.
  • ప్రొఫెషనల్ కోర్సుల్లో స్థానిక విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి.
  • నిష్పత్తి పెరగడంతో తెలంగాణ విద్యార్థులకు తమ సొంత‌ రాష్ట్రంలో మంచి విద్యాసాధనకు అవకాశాలు పెరుగుతాయి.
  • ప్రభుత్వ రాయితీల ప్రయోజనాలు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే పరిమితం అవుతాయి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?