- డాక్యుమెంట్ కు 30 వేలు తీసుకున్నట్లు ఆరోపణలు..
- ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో “సస్పెండ్” రిపీట్ అయ్యేనా?
Corruption Free Telangana | ఆ సబ్ రిజిస్ట్రార్ బరితెగించినట్లు స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖలో ప్రచారం జరుగుతోంది.. మామూళ్ల కోసం రియల్టర్లతో కుమ్మక్కై అనుమతిలేని వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి అందిన కాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. అనుమతి లేని వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినందుకు అదే కార్యాలయంలో గత ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ రాజేష్ సస్పెండ్ అయిన విషయం తెలిసినప్పటికీ.. ఎలాంటి అదురు బెదురు లేకుండా ప్రస్తుత ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ అక్రమ వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు సమాచారం. అనుమతి లేని వెంచర్ లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తూ సదరు సబ్ రిజిస్ట్రార్ పరోక్షంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయానికి కూడా భారీగా గండి కొడుతున్నట్లు తెలుస్తోంది.
Corruption in Khila Warangal : ప్రతీ డాక్యుమెంట్ కు ఓ రేటు..
ఖిలా వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం (Khilawarangal Registration office ) లో ముడుపుల జాతర నడుస్తున్నట్లు తెలుస్తోంది. కార్యాలయంలో ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న ఆ అధికారి ప్రతి డాక్యుమెంట్ కు ఓ రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అనుమతి లేని వెంచర్ లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి పెద్దమొత్తంలో దండుకుంటున్నట్లు కార్యాలయంలో జోరుగా ప్రచారం సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్ లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినందుకు గాను ఒక్కో డాక్యుమెంట్ కు 30 వేల వరకు ముట్టజెపుతున్నట్లు రియల్టర్ లు చెవులుకొరుక్కుంటున్నారు.
సస్పెండ్ చేస్తారా..?
గతంలో ఖిలా వరంగల్ ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ (Khilawarangal incharge Registrar) గా విధులు నిర్వహించిన “రాజేష్” ను నాన్ లేఅవుట్ వెంచర్ లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినందుకు స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖ డి ఐ జి ఆదేశాల మేరకు అప్పటి జిల్లా రిజిస్ట్రార్ సస్పెండ్ చేశారు.అదే రీతిలో ప్రస్తుత ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ కూడా నాన్ లేఅవుట్ లోని ప్లాట్లను అమ్యామ్యాలు (Corruption ) పుచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎలాగైతే అనుమతి లేని వెంచర్ లోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ (Plots Registraions) చేసినందుకు రాజేష్ అనే ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేశారో,అచ్చం అలాగే అనుమతి లేని వెంచర్ లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసిన ప్రస్తుత ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేస్తారా? లేదా? అనేది రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..