Oscar winners 2025 LIVE Updates : లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 97వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. అవార్డు విజేతలు (Oscar winners ) తమ అద్భుతమైన ప్రతిభతో చరిత్రను లిఖించారు. ఈసారి అస్కార్ ఉత్తమ చిత్రంగా అనోరా (Anora) ఎంపికైంది. ఉత్తమ చిత్రం కోసం గట్టి పోటీ మధ్య అనోరా అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిల్‌ను దక్కించుకుంది. ఇక “ది బ్రూటలిస్ట్ (The Brutalist) ” చిత్రంలో తన పాత్రకు గాను అడ్రియన్ బ్రాడీ (Adrien Brody) ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు. ఉత్తమ నటి: “అనోరా” చిత్రంలో మైకీ మాడిసన్ (Mikey Madison) ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.
Oscar winners List : ఆస్కార్ 2025 అవార్డు విజేతల పూర్తి జాబితా
- ఉత్తమ చిత్రం: “అనోరా”
- ఉత్తమ నటుడు: అడ్రియన్ బ్రాడీ, “ది బ్రూటలిస్ట్”
- ఉత్తమ నటి: మైకీ మాడిసన్, “అనోరా”
- ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర్(Sean Baker), “అనోరా”
- ఉత్తమ సహాయ నటి: జో సల్దానా, “ఎమిలియా పెరెజ్”
- ఉత్తమ సహాయ నటుడు: కీరన్ కుల్కిన్, “ఎ రియల్ పెయిన్”
- ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: “ఐ యామ్ స్టిల్ హియర్”
- ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: “నో అదర్ ల్యాండ్”
- ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: “అనోరా, ” సీన్ బేకర్
- ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: “కాన్క్లేవ్, ” పీటర్ స్ట్రాఘన్
- ఉత్తమ ఒరిజినల్ స్కోర్: “ది బ్రూటలిస్ట్, ” డేనియల్ బ్లమ్‌బర్గ్
- ఉత్తమ ఒరిజినల్ సాంగ్: “ఎమిలియా పెరెజ్” నుండి “ఎల్ మాల్”
- ఉత్తమ యానిమేటెడ్ చిత్రం: “ఫ్లో”
- విజువల్ ఎఫెక్ట్స్: “డూన్: పార్ట్ 2
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: “వికెడ్, ” పాల్ టేజ్‌వెల్
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: “ది బ్రూటలిస్ట్, ” లోల్ క్రాలే
- ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: “ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా”
- ఉత్తమ సౌండ్: “డూన్: పార్ట్ 2”
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: “వికెడ్”
- ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్ “: ది సబ్‌స్టాన్స్”
- ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: “అనోరా, ” సీన్ బేకర్
- ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: “ఐ యామ్ నాట్ ఎ రోబోట్”
- ఉత్తమ యానిమేటెడ్ లఘు చిత్రం: “ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రస్”
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







