Anora movie Story | మూవీ వరల్డ్ లో నే అత్యున్నతమైన అవార్డ్స్ గా పేరున్న ఆస్కార్ అవార్డ్స్ (Oscar awards)వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ లో జరిగాయి.ఈ రోజు (మార్చి 3 న) న విజేతలకు ఈ అవార్డ్స్ ని అందించారు.ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఎవ్రీ ఇయర్ ఈ అవార్డులను అందిస్తున్నారు.97 వ ఆస్కార్ అవార్డుల వేడుకలో కొనాన్ ఓబ్రియన్ హోస్ట్ చేయగా చాలా మంది స్టార్స్ హాజరయ్యారు. 2024 అక్టోబర్ లో సీన్ బేకర్ (sean baker) (ది రెడ్ రాకెట్ ,ది ఫ్లోరిడా ప్రాజెక్ట్ ఫేమ్) డైరెక్షన్ లో వచ్చిన
అనోరా (Anora movie) మూవీ ఏకంగా ఐదు (బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్ ,బెస్ట్ హీరోయిన్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే,బెస్ట్ ఎడిటింగ్) విభాగాల్లో అవార్డులను గెలుచుకుని దుమ్ము దులిపింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి కలెక్షన్స్ కొల్లగొట్టింది.
Anora movie Story : అసలు అనోరా మూవీ కథేంటి..
ఒక ధనవంతుడైన యువకుడు ఒక వేశ్యను లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. యువకుడి పేరెంట్స్ కి ఈ విషయం తెలియడంతో వా రు ఆమెకు కొంత డబ్బు ఆశ చూపి వారి కొడుకుని వదిలేయమని కోరుతారు. ఆమె ఆ డబ్బులకు లొంగి అతడిని వదిలేస్తుందా..? అతడ్ని వారి పేరెంట్స్ తీసుకెళ్ళిపోతారా..? ఆ తరువాత ఏం జరిగింది ..అనేది స్టోరీ.
మొత్తం ఐదు విభాగాల్లో..
సీన్ బేకర్ డైరెక్షన్ లో మైకీ మాడిసన్ (maiki madisan) ,మాక్ ఎడిల్జియన్ (mak ediljian) నటించిన ఈ మూవీ 97 వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ మూవీ గా ఆస్కార్ ఆందుకుంది. ఈ మూవీ మిగితా విభాగాల్లో కూడా మెప్పించింది. మూవీకి దర్శకత్వం వహించిన సీన్ బేకర్ బెస్ట్ డైరెక్టర్ గా,బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ అందుకున్నాడు. మూవీలో ఒక వేశ్య క్యారెక్టర్ లో అదరగొట్టిన మైకీ మాడిసన్ బెస్ట్ హీరోయిన్ గా ఆస్కార్ అందుకున్నారు.25 ఏళ్ల ఈ సుందరి ఆస్కార్ కి ఎంపికైన మొదటి సారే బెస్ట్ హీరోయిన్ గా అవార్డు ను గెలుచుకోవడం విశేషం. అలాగే ఎడిటింగ్ విభాగంలో ఆస్కార్ అందుకుని మొత్తం ఐదు ఆస్కార్ లు అందుకుంది.ప్రస్తుతం అనోరా మూవీని ఆడియన్స్ చూడాలంటే అమెజాన్ ప్రైమ్ తో పాటు పలు ఓటీటీ లో అందుబాటులో ఉంది.
అనోరాను ఆన్‌లైన్‌లో ఎక్కడ చూడాలి
అకాడమీ అవార్డు గెలుచుకున్న అనోరా ప్రస్తుతం ZEE5లో ₹ 129 అద్దెకు డిజిటల్‌గా ప్రసారం అవుతోంది . అయితే, JioHotstar సబ్‌స్క్రైబర్లు మార్చి 17 నుండి OTT ప్లాట్‌ఫామ్‌లో దీన్ని ఉచితంగా చూడవచ్చు.
అనోరా తారాగణం
- అనోరా ‘అని’ మిఖీవాగా మైకీ మాడిసన్ (Mikey Madison)
- ఇవాన్ ‘వన్య’ జఖారోవ్‌గా మార్క్ ఐడెల్‌స్టెయిన్
- ఇగోర్ గా యురా బోరిసోవ్
- టోరోస్‌గా కారెన్ కరాగులియన్
- గార్నిక్ గా వాచే తోవ్మాస్యన్
- డైమండ్ గా లిండ్సే నార్మింగ్టన్
- నిక్కీగా ఎమిలీ వీడర్
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







