MLC Election Result : కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బిజెపి బలపరిచిన అభ్యర్థి ఘన మల్క కొమురయ్య (Malka Komuraiah) విజయం సాధించారు. ఇక నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఈ విజయం ఆయనను వరించింది. మరోవైపు వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది.
కాగా గత నెల 27వ తేదీన తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే..
ఆ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. వాటిలో ఒకటి వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఇక రెండోది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి. అదే విధంగా.. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల స్థానానికి సంబంధించిన ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది.
MLC Election Result : బిజెపి అభ్యర్థి గెలుపు
అయితే వీటిలో రెండు స్థానాల ఫలితాలపై స్పష్టత వచ్చింది. ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో తొలిసారి బీజేపీ (BJP) విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. కొమురయ్యకు 12,959 వోట్లు పోలైయ్యాయి. ఇక 12081 ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌ను కొమురయ్య దాటి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందారు. ఎన్నికల బరిలో నిలిచిన వంగ మహేందర్ రెడ్డికి 7182, అశోక్ కుమార్‌కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 వోట్లు పోలైయ్యాయి
పిఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం
మరోవైపు నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ (PRTU) అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి (Pingili Shreepal Reddy) విజయం సాధించారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. ఆయన 11, 800 ఈ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








