Sarkar Live

Warangal : ఆడ‌పిల్ల‌ల‌కు మత్తు మందు ఇచ్చి మృగాళ్లకు అప్పగిస్తూ..

Warangal News | డ్ర‌గ్స్ కు బానిసైన ఓ కిలాడీ లేడి స్కూళ్ల‌కు వెళ్లే అమాయక ఆడపిల్లల‌ను టార్గెట్ చేసింది. మత్తు మందులకు అలవాటు పడి ముఠాగా ఏర్పడిన కొంద‌రు దుండ‌గులు కొన్ని రోజులుగా ఎన్నో అకృత్యాలు పాల్ప‌డ్డారు. చివ‌ర‌కు వీరి

Warangal News |

Warangal News | డ్ర‌గ్స్ కు బానిసైన ఓ కిలాడీ లేడి స్కూళ్ల‌కు వెళ్లే అమాయక ఆడపిల్లల‌ను టార్గెట్ చేసింది. మత్తు మందులకు అలవాటు పడి ముఠాగా ఏర్పడిన కొంద‌రు దుండ‌గులు కొన్ని రోజులుగా ఎన్నో అకృత్యాలు పాల్ప‌డ్డారు. చివ‌ర‌కు వీరి ఘోరాలు చూసి ఏకంగా పోలీసులే షాక్ అయ్యారు. వారు చేసిన దారుణాలు తెలుసుకుంటే ఆడపిల్లలను పాఠశాలలకు పంపాలంటేనే అంద‌రిలో వ‌ణుకు పుడుతోంది. వివ‌రాల్లోకి వెళితే..

హనుమకొండ (Hanmakonda) జిల్లా దామెర (Damera) మండలానికి చెందిన ఓ కిలాడీ లేడీ కొన్నాళ్లుగా వరంగల్‌ ‌మిల్స్ ‌కాలనీలో నివాసముంటోంది. స‌ద‌రు మహిళ తనతోపాటు డ్రగ్స్‌ (Drugs)కు అలవాటు పడిన ఓ యువ‌తితో పాటు మ‌రో నలుగురు యువకులతో కలిసి ముఠా ఏర్పడ్డారు. వీరంతా పాఠశాలల‌కు వెళ్లే విద్యార్థినుల‌ను టార్గెట్ చేసుకుని దారుణాలకు పాల్పడ్డారు. వరంగల్‌లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్‌ ‌పాఠశాలల వద్ద త‌ర‌చూ రెక్కీ నిర్వహించేవారు. ఈ కిలేడీ స్కూళ్లకు వెళ్లే బాలికలతో మాట‌లు క‌లిపి పరిచయం పెంచుకునేది. అలా ఎంపిక చేసుకున్న బాలికలకు రోజూ మాటలు కలిపేది.. అలా పరిచయం పెంచుకుని అలా స‌ర‌దాగా బయటకు వెళ్దామని చెప్పి కిడ్నాప్‌ ‌చేస్తుండేది. ఆ త‌ర్వాత బాలికలకు డ్ర‌గ్స్ ఇచ్చి తన గ్యాంగ్ లోని మానవ మృగాలకు బాలిక‌ల‌ను అప్పగించేది. వారంతా డ్రగ్స్ ‌మత్తులో ఉన్న బాలికపై అత్యాచారం చేసి లైంగిక దాడుల‌కు పాల్ప‌డేవారు. ఆ త‌ర్వాత బాలికను తిరిగి ఆ మహిళకు అప్పగించేవారు. ఇలా బాలికలను వివిధ జిల్లాలకు సైతం కిలేడీ తిప్పేదని పోలీసులు భావిస్తున్నారు.

అసలు విషయం వెలుగులోకి..

రెండు రోజుల క్రితం వ‌రంగ‌ల్‌ మిల్స్ ‌కాలనీ (Warangal Mils Colony) లో ఓ బాలిక కిడ్నాప్ కు గుర‌య్యింది. దీంతో బాలిక‌ తల్లిదండ్రులు వెంట‌నే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రెండు రోజుల తర్వాత బాలిక తనంతట తానే ఇంటికి చేరుకుంది. ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా అస‌లేం జ‌రిగింద‌ని బాలికను ప్ర‌శ్నించగా మొత్తం వివ‌రాల‌ను వెల్ల‌డించింది. కాగా త‌న‌ను ఓ మహిళ కొన్ని రోజుల క్రితం పరిచయం చేసుకుంద‌ని, బయటకు వెళ్దామని చెప్పి తీసుకెళ్లిందని పేర్కొంది. అనంతరం మత్తుమందు ఇచ్చిందని ఆ తర్వాత ఏం జరిగింతో త‌న‌కు గుర్తురావడం లేద‌ని చెప్పింది.

దీంతో పోలీసులు వెంట‌నే బాలికను హాస్పిటల్‌కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా డ్రగ్స్ ‌పాజిటివ్‌గా తేలింది. ఈ ఘటనపై పోలీసులు (Warangal Polilce) కేసు నమోదు చేశారు. డ్ర‌గ్స్ గ్యాంగ్‌ ‌కోసం ముమ్మ‌రంగా గాలింపు చర్యలు చేపట్టారు. వీరి ఆకృత్యాలు తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు షాక్ అవుతున్నారు. ఒంటరిగా పిల్లలను పాఠశాలలకు పంపించాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?