Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాజకీయ వేడి ఈ రోజు మరింత పెరిగింది. గవర్నర్ ప్రసంగం (Governor Jishnu Dev Varma’s speech)పై చర్చ జరుగుతుండగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ చేసిన వాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (BRS supremo K Chandrashekhar Rao)పై ఆయన వివాదాస్పద కామెంట్లు చేయడంతో బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi (BRS) ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
Telangana Assembly : కేసీఆర్‌ను రేవంత్ ఏమన్నారు?
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) మాట్లాడుతూ కె. చంద్రశేఖర్ రావు స్ట్రెచర్ (stretcher)పై ఉన్నారని, త్వరలోనే మర్చురీ (mortuary)లోకి వెళ్లిపోతారని వ్యాఖ్యనించడం కలకలం రేపింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా విచక్షణను కోల్పోయి అనుచిత వ్యఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. సీఎం వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్ (BRS) శ్రేణుల్లో ఆగ్రహం తెప్పించాయి. సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్లలో ఆ పార్టీ నాయకులు ఫిర్యాదులు చేశారు. పలు చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. ముఖ్యమంత్రి తన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ వర్గాలు మాత్రం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను సమర్థిస్తున్నాయి. దీంతో అగ్గికి మరింత ఆజ్యం పోసినట్టయ్యింది. రాష్ట్రంలో అధికారపార్టీ, ప్రతిపక్షం మధ్య రాజకీయ పోరు తీవ్ర రూపం దాల్చింది.
నిరసనలు జరుగుతుండగానే మరో వివాదం
నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌పై వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.జగదీశ్వర్‌రెడ్డి (G Jagadish Reddy) సస్పెషన్‌కు గురయ్యారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న ఓ శాసన సభ్యుడిని ఇలా సభ నుంచి బహిష్కరించడం అన్యాయమని విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యప్తంగా దీనిపై నిరసనలు వ్యక్తమవుతున్న క్రమంలోనే కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఈ రోజు కామెంట్లు చేయడం మరింత వివాదాస్పదమైంది. దీంతో అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







