Sarkar Live

Telangana Budget 2025 | క్రీడారంగానికి భారీ బ‌డ్జెట్‌.. ఎన్ని కోట్లో తెలుసా?

Telangana Budget 2025 : తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ (The annual budget)ను అసెంబ్లీలో ఈ రోజు ప్రవేశపెట్టింది (Telangana Legislative Assembly). ఈసారి క్రీడలకు (sports) కేటాయించిన బడ్జెట్ గత ఏడాదితో పోలిస్తే రూ.

Telangana Budget 2025

Telangana Budget 2025 : తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ (The annual budget)ను అసెంబ్లీలో ఈ రోజు ప్రవేశపెట్టింది (Telangana Legislative Assembly). ఈసారి క్రీడలకు (sports) కేటాయించిన బడ్జెట్ గత ఏడాదితో పోలిస్తే రూ. 100 కోట్లు పెరిగింది. 2024లో క్రీడా రంగానికి రూ. 365 కోట్లు కేటాయించారు. 2025లో ఇది రూ. 465 కోట్లకు చేరింది. దీనిపై క్రీడాకారులు, కోచ్‌లు, స్పోర్ట్స్ అసోసియేషన్ల ప్ర‌తినిధులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Telangana Budget 2025 : ఇంత భారీ బ‌డ్జెట్ ఎందుకు?

రాష్ట్రంలో క్రీడా సౌక‌ర్యాల‌ను మెరుగుప‌ర్చ‌డం, యువ క్రీడాకారులను ప్రోత్సహించ‌డ‌మే ల‌క్ష్యంగా కృషి చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వం (Government of telangana) ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగానే భారీ బ‌డ్జెట్‌ను కేటాయించామ‌ని అంటోంది. అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదికలు, ఆధునిక స్టేడియంల నిర్మాణం, క్రీడాకారులకు శిక్షణ సౌకర్యాలు మెరుగుపర్చడం, గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రీడా ప్రోత్సాహం పెంచడం వంటి ఎన్నో కార్యక్రమాలను చేప‌డుతున్నామ‌ని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో పెద్ద స్థాయిలో స్టేడియంలు, ఇండోర్ స్పోర్ట్స్, స్విమ్మింగ్ పూల్స్, అకాడ‌మీలు ఏర్పాటయ్యాయి. రాయల్టీ స్థాయిలో ఉండే ఆడిటోరియంల నిర్మాణానికి నిధులను కేటాయించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనూ క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఇవి గ‌త బీఆర్ ఎస్ హ‌యాంలో కొన‌సాగ‌గా ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌రింత ముందుకు తీసుకెళ్తోంది.

క్రీడాకారుల‌కు ఆర్థిక సాయం

క్రీడాకారులకు ఆర్థికంగా సహాయం చేసేందుకు కూడా ప్ర‌భుత్వం ముందుకు వస్తోంది. అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు నేరుగా నిధులు అందించడంతో పాటు, వారికి అత్యున్నత స్థాయి శిక్షణ ఇచ్చేందుకు టాప్ కోచ్‌లను నియమిస్తోంది. ఇటీవలే ప్రపంచ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నగదు బహుమతులు, నివేశ‌న స్థలాలు, ఉద్యోగ అవకాశాలు అందజేసింది.

Telangana Budget 2025 : గ్రామీణ స్థాయి క్రీడ‌ల‌కు ప్రోత్స‌హం

క్రీడా మౌలిక వసతులను అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రీడలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. పల్లెల్లో గల్లీ క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ వంటి క్రీడలను ప్రోత్సహించేందుకు పంచాయతీ స్థాయిలోనూ నిధులను కేటాయిస్తోంది. ప్రతి మండల కేంద్రంలోనూ ఒక క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

హ‌ర్షం వ్య‌క్తం చేసిన SATS చైర్మ‌న్‌

క్రీడా బడ్జెట్‌ను భారీగా పెంచడం పట్ల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (SATS) చైర్మ‌న్‌ శివసేన రెడ్డి (Shiva Sena Reddy) హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం క్రీడలపై తీసుకుంటున్న చొరవ మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో వచ్చేందుకు, వారికి కావాల్సిన మౌలిక వసతులు అందించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?