Sarkar Live

Betting Apps | సినీ ప్ర‌ముఖుల‌పై కేసులు.. నేరం ఏమిటంటే..

Betting Apps : ప్రముఖ టాలీవుడ్ (Tollywood) నటులు రానా దగ్గుబాటి (Rana Daggubati), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), ప్రకాశ్‌రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ సహా పలువురిపై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

Betting Apps

Betting Apps : ప్రముఖ టాలీవుడ్ (Tollywood) నటులు రానా దగ్గుబాటి (Rana Daggubati), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), ప్రకాశ్‌రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ సహా పలువురిపై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వీరు సోషల్ మీడియా వేదికగా పాప్అప్ ప్రకటనల ద్వారా బెట్టింగ్ యాప్స్ (betting apps)ను ప్రచారం చేసినట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. మియాపూర్ (Miyapur)కు చెందిన వ్యాపారి పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు అయింది.

గేమింగ్ చ‌ట్టం కింద కేసు న‌మోదు

బెట్టింగ్, జూదం, కాసినో యాప్స్‌లో యువ‌త డ‌బ్బులు పెట్ట‌డాన్ని ఈ సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా ప్రోత్స‌హిస్తున్నార‌ని (promoting) ఫిర్యాదుదారు పేర్కొన్నారు. దీంతో వీరిపై పోలీసులు 318(4), 112 రీడ్ విత్ 49 బీఎన్‌ఎస్, తెలంగాణ గేమింగ్ చట్టం కింద సెక్షన్ 3, 3(ఎ), 4, ఐటీ చట్టం సెక్షన్ (డీ) ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ యాప్స్ వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత తీవ్రంగా ప్రభావితమవుతున్నారని పోలీసులు గుర్తించారు. పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ (betting apps)పై దృష్టి పెట్టిన విషయం ఇటీవలే టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ చేపట్టిన అవగాహన కార్యక్రమంతో వెలుగులోకి వచ్చింది. ఆయన ఈ యాప్స్ వల్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఎంతటి నష్టాలను ఎదుర్కొంటున్నారో వివరించి, వీటి విషయంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

Betting Apps Row : ప్ర‌ముఖుల ప్రమోష‌న్

ఈ యాప్స్ ప్రమోషన్‌ను ప్రధానంగా సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు (social media influencers) చేయడం వల్ల యువత మోసపోతోందని పోలీసులు పేర్కొన్నారు. పలు ప్రముఖులు, తారలు తమ ఫేమ్, క్రేజ్ ఆధారంగా వీటిని ప్రమోట్ చేయడం వల్ల, వీటిపై నమ్మకంతో పెద్ద సంఖ్యలో యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌కు ఆకర్షితులవుతున్నారని తెలిపారు.

నిషేధం ఉన్నా.. విచ్చ‌ల‌విడిగా Betting Apps

ఇటీవలే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్‌(betting apps)పై నిషేధం విధించేందుకు చట్టాలు రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ యాప్స్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొన్ని పాప్ అప్ యాడ్స్, సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఈ యాప్స్‌ను తిరిగి ప్రజల్లోకి తీసుకువస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రముఖ నటులు, ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్ర‌మోష‌న్ల వ‌ల్ల ఎంతో మంది యువత ఈ యాప్స్‌కు బలవుతున్నారని, చాలా కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ కేసును స‌మ‌గ్రంగా ద‌ర్యాప్తు చేసి ప్రమోషన్‌కు పాల్పడిన‌ట్టు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులను విచారణకు పిలవొచ్చని సమాచారం.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?