Sarkar Live

Puri Jagannadh | పూరీ ఈసారి బెగ్గర్…?

వెండితెరపై హీరోయిజాన్ని ఓ లెవల్లో చూపించే డైరెక్టర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). ఒకప్పుడు ఈయన డైరెక్షన్ లో మూవీ చేయడానికి హీరోలు ఎదురుచూసేవారు. చాలా మంది హీరోలను తన డైలాగ్ లతో స్టార్

Puri Jagannadh

వెండితెరపై హీరోయిజాన్ని ఓ లెవల్లో చూపించే డైరెక్టర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). ఒకప్పుడు ఈయన డైరెక్షన్ లో మూవీ చేయడానికి హీరోలు ఎదురుచూసేవారు. చాలా మంది హీరోలను తన డైలాగ్ లతో స్టార్ ఇమేజ్ తీసుకొచ్చారు.ప్రజెంట్ పూరీకి బ్యాడ్ సిట్యువేషన్ నడుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఈయన తీసిన మూవీస్ అన్ని అట్టర్ ప్లాప్ లు అవుతున్నాయి.

Puri Jagannadh : ఇస్మార్టే ఆఖరి హిట్టు..

రామ్ (ram)తో తీసిన ఇస్మార్ట్ శంకర్ హిట్టు తర్వాత ఈయన తీసిన ఏ మూవీ సరిగా ఆడలేదు. విజయ్ దేవరకొండ(vijay Devarakonda)తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన లైగర్ ఊహించని రీతిలో డిజాస్టర్ అయింది. ఆ తర్వాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కూడా దారుణంగా నిరాశ పరిచింది. పూరీ కంబ్యాక్ అయ్యడనుకున్న ఆడియన్స్ ఆశలను నిలబెట్టుకోలేకపోయాడు. కానీ డిజాస్టర్ లతో సంబంధం లేకుండా పూరీ మూవీస్ ని ప్లాన్ చేస్తూనే ఉంటాడు.

ఈ సారి ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (vijay Sethupathi)కి అదిరిపోయే స్టోరీ రాశాడట. ఇప్పటికే ఆ స్టోరీ ని అతడికి వినిపించాడట కూడా. మరి కొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. కొన్ని రోజులుగా గోపీచంద్ తో, అలాగే కింగ్ నాగార్జున తో మూవీ తీయబోతున్నాడని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు అది విజయ్ సేతుపతి దగ్గర ఆగింది.వీరిద్దరి కాంబోలో మూవీపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనన రాక ముందే ఓ క్రేజీ టైటిల్ కూడా చక్కర్లు కొడుతోంది.

పూరీ – విజయ్ సేతుపతి కాంబో టైటిల్..

పూరీ – విజయ్ సేతుపతి కాంబో మూవీ టైటిల్ బెగ్గర్ అని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.మొదటి నుండి కూడా పూరీ మూవీస్ టైటిల్స్ (Puri Jagannadh Movies) ఎంత వెరైటీ గా పెడుతారో మనకు తెలుసు.విజయ్ సేతుపతి తో మూవీకి కూడా ఇలా డిఫరెంట్ గా టైటిల్ ఉందంటే మూవీ అదిరిపోయేలా తీస్తారని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి మునుపటి పూరీ హవా బాక్సాఫీస్ వద్ద ఎలా ఉండేదో ఈ మూవీతో మళ్ళీ చూపెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రజెంట్ విజయ్ సేతుపతి డేట్స్ దొరకడమే కష్టం. అలా ఉంది ఇప్పుడు ఆయన రేంజ్. మరి ఫ్లాఫ్ లో ఉన్న పూరీకి ఓకే చెప్పాడంటే స్టోరీ నచ్చడం ఒకటయితే పూరీ టేకింగ్ మీద నమ్మకం కూడా అయి ఉండొచ్చు. మరికొద్ది రోజుల్లో వీరి కాంబోలో వచ్చే మూవీపై అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?