Sarkar Live

Urinates on ATM | ఏటీఎంపై మూత్ర విస‌ర్జ‌న.. హైద‌రాబాద్‌లో విచిత్ర ఘ‌ట‌న‌

Urinates on ATM | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని రాజ్‌భ‌వ‌న్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంక్ ఏటీఎంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్ర‌బుద్దుడు డ‌బ్బులు డ్రా చేశాక అదే ఏటీఎంపై మూత్ర విస‌ర్జ‌న చేశాడు (Urinates on

ATM withdrawals

Urinates on ATM | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని రాజ్‌భ‌వ‌న్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంక్ ఏటీఎంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్ర‌బుద్దుడు డ‌బ్బులు డ్రా చేశాక అదే ఏటీఎంపై మూత్ర విస‌ర్జ‌న చేశాడు (Urinates on ATM). ఈ ఘ‌ట‌న మార్చి 10న చోటుచేసుకోగా ఆల‌స్యంగా ఈరోజు వెలుగులోకి వ‌చ్చింది.

Urinates on ATM : సంఘటన ఎలా జరిగింది?

ఆ రోజు సాయంత్రం ఓ వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించి తన ఖాతా నుంచి నగదు డ్రా చేశాడు. ఆ త‌ర్వాత అత‌డు ఏటీఎం మిషిన్‌పై మూత్ర విసర్జన చేశాడు. దీనివల్ల మిషిన్‌లోని సెన్సార్ దెబ్బతింది. బ్యాంక్ సిబ్బంది రోజువారీ తనిఖీలు నిర్వహించినప్పుడు మిషిన్ సరిగ్గా పనిచేయకపోవడం గమనించారు. మిషిన్ సెన్సార్ ఎందుకు పనిచేయడం లేదో తెలుసుకోవడానికి సాంకేతిక నిపుణులు పరిశీలింగా, దాని పైభాగంలో మూత్రం వాసన వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే బ్యాంక్ సిబ్బంది ఏటీఎంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌(CCTV)ను పరిశీలించారు.

ఎలా బయటపడింది?

సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఏటీఎంలోకి ప్రవేశించిన వ్యక్తి నగదు డ్రా చేసిన తర్వాత ఉద్దేశపూర్వకంగా మిషిన్‌పై మూత్ర విసర్జన చేసినట్లు స్పష్టమైంది. ఇది చూసి బ్యాంక్ సిబ్బంది ఆశ్చర్యపోయారు.

బ్యాంక్ అధికారులు ఏం చేశారు?

సంఘటనను గమనించిన బ్యాంక్ అధికారులు వెంటనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో (Punjagutta police) ఫిర్యాదు చేశారు. మిషిన్‌ సెన్సార్ దెబ్బతినడంతో బ్యాంక్‌కు నష్టం వాటిల్లిందని, దీనికి పాల్పడిన వ్య‌క్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ (CCTV)ను సేకరించి వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నారు.

న‌గ‌దు లావాదేవీ ఆధారంగా వివ‌రాల సేక‌ర‌ణ‌

బ్యాంక్ సిబ్బందిని విచారించి మరిన్ని వివరాలు రాబ‌ట్టారు. ఏటీఎంలో నగదు డ్రా చేసిన ట్రాన్స్‌ట్రాక్ష‌న్ ఆధారంగా ఆ వ్యక్తి ఎవరు, అతడి ఖాతా వివరాలు ఏమిటి? అనే వివరాలను బ్యాంక్ నుంచి సేక‌రిస్తున్నారు.ఇది అత్యంత విచిత్రమైన సంఘటనల్లో ఒకటిగా మారింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీసీటీవీ ఆధారంగా అతని వివరాలు త్వరలోనే బయటపడే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?