Sarkar Live

Ghajini 2 movie | అసలు గజిని -2 ఉన్నట్టా.. లేనట్టా..?

Ghajini 2 movie | టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ (AR Murugadas) తీసే మూవీస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తీసిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీల్లో గజినీ మూవీ ఒకటి. సూర్య(surya )హీరోగా ఆసిన్(Asin), నయనతార (Nayanthara)

Ghajini 2 movie

Ghajini 2 movie | టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ (AR Murugadas) తీసే మూవీస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తీసిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీల్లో గజినీ మూవీ ఒకటి. సూర్య(surya )హీరోగా ఆసిన్(Asin), నయనతార (Nayanthara) హీరోయిన్లుగా వచ్చిన మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. ఈ మూవీని హిందీలో అమీర్ ఖాన్ (Ameer Khan) హీరోగా గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్లో మురుగదాసే తెరకెక్కించాడు.

అక్కడ ఈ మూవీ మొట్టమొదటిసారిగా 100 కోట్లు కొట్టిన మూవీగా నిలిచిపోయింది. అమీర్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక అప్పటి నుంచి ఏదో ఒక సినీ ఫంక్షన్ లో గజినీ -2 ఉంటుందని ఎవరో ఒకరు చెబుతూనే ఉన్నారు. ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ అది కార్యరూపం దాల్చడం లేదు.

Ghajini 2 movie పై మురుగదాస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..

అటు అమీర్ ఇటు మురగదాస్ వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఒక ఫంక్షన్ లో అల్లు అరవింద్ ఈ మూవీ సీక్వెల్ గురించి మాట్లాడారు. అప్పటినుంచి ఆడియన్స్ కి కూడా ఈ మూవీ వస్తే బాగుండు అని క్యూరియాసిటీ పెరిగిపోయింది. తాజాగా డైరెక్టర్ మురగదాస్ కూడా ఈ మూవీ సీక్వల్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. గజినీ -2 (Ghajini 2 movie ) డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయని స్వయంగా ఆయన చెప్పుకొచ్చారు.

కాకపోతే ప్రస్తుతం మురుగదాస్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు అమీర్ కూడా తారే జమీన్ పర్ సీక్వెల్ కూడా మొదలు పెట్టారు. అయితే ఇవి స్టార్ట్ కాకముందే ఈ డిస్కషన్స్ మొదలయ్యాయట. మురగదాస్ సల్మాన్ ఖాన్ (Salman Khan)తో తీస్తున్న సికిందర్ (Sikandar) మూవీ మేకింగ్ కూడా అయిపోయింది. ఈమధ్య టీజర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రంజాన్ సందర్భంగా ఈనెల ఆఖరిలో మూవీ ప్రేక్షకుల ముందు రానుంది. నెక్స్ట్ మూవీ గజిని-2 అయి ఉండొచ్చు అని ప్రేక్షకులు ఊహించుకుంటున్నారు.

హిట్టు కోడితేనే..

అయితే కొన్ని సంవత్సరాలుగా మురగదాస్ ట్రాక్ రికార్డ్ ఏమాత్రం బాలేదు. ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్ వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. ఇటువంటి సిట్చువేషన్ లో అమీర్ ఖాన్ డేట్స్ ఇవ్వాలంటే సల్మాన్ ఖాన్ తో తీస్తున్న సికిందర్ మూవీ ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సి ఉంటుంది.లేకపోతే అసలే భారీ అంచనాలు పెట్టుకున్న లాల్ సింగ్ చడ్డా మూవీ దారుణంగా ఫ్లాఫ్ అయింది. ఆ పరిస్థితి చూసిన అమీర్ ఖాన్ మురుగదాస్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చు.గజిని -2 భవిష్యత్తు సికిందర్ మూవీ హిట్టు పైన ఆధారపడి ఉంది. ఏదైనా ప్రేక్షకులకు గజినీ -2 (Ghajini 2 movie ) పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ మూవీపై మరో అప్డేట్ రావాలంటే సికిందర్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే..


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?