Tollywood | టాలీవుడ్ లో నిర్మాతలుగా నిలదొక్కుకోవాలంటే అంత సులువు కాదు. పది సినిమాలు తెచ్చిన డబ్బులు ఒక్క సినిమాతో పోయి అన్ని పోగొట్టుకున్న వారు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. మూవీ నిర్మానికి కావాల్సింది డబ్బులే కాదు…మూవీపై ఫ్యాషన్ కూడా ఉండాలి.అలా ముందు వరుసలో సురేష్ ప్రొడక్షన్స్(Suresh productions) రామానాయుడు, వైజయంతి మూవీస్(vaijayanti movies)అశ్వినీదత్, గీతా ఆర్ట్స్ (Geetha arts) అల్లు అరవింద్ ఇలా ఉండేవారు.
వారికి ఎన్ని డబ్బులు వస్తున్నాయనేది తర్వాత సంగతి..ముందు మూవీ ఎలా వస్తుంది.. ఇంకా ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుందా…ఈ రోజు సెట్స్ లో ఎవరి కాంబినేషన్స్ నడుస్తున్నాయి అనేది తెలుసుకుని రోజంతా సినిమా సెట్స్ లోనే ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.ఒకప్పుడు ఇండస్ట్రీ ని ఏలిన వారే సినిమాలు తీయకుండా ఉంటున్నారు. ప్రొడ్యూసర్ల పని ఇప్పుడు క్యాషియర్ లాంటి పరిస్థితి లో మారిందని చాలా మంది నిర్మాతలు పలుమార్లు వారి ఆవేదనని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇండస్ట్రీలో కొన్ని నిర్మాణ సంస్థలు హవా చూపిస్తున్నాయి. అందులో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ (svcc) బ్యానర్ పై దిల్ రాజు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వ ప్రసాద్(vishwa prasad), సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి, మైత్రీ మూవీ మేకర్స్ (Maithri Movie Makers)బ్యానర్ పై రవిశంకర్ లాంటి కొందరు స్టార్స్ తో మూవీలను నిర్మించడానికి పోటీ పడుతున్నారు.
Tollywood : అన్నీ బడా సినిమాలే..
ఇందులో మైత్రీ మూవీ లైనప్ చూస్తే మూవీ లవర్స్ కి మతిపోయేలా ఉంది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ, అలాగే రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది మూవీ (Peddi)ని కూడా నిర్మిస్తోంది. రీసెంట్ గా మేకర్స్ హీరో ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది.ప్రభాస్ – హను రాఘవపూడి కాంబో, పవన్ కళ్యాణ్ -హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవర కొండ – రాహుల్ సాంకృత్యాన్ మూవీ, అలాగే ఇటీవలే డ్రాగన్ మూవీతో బంపర్ హిట్టు కొట్టిన ప్రదీప్ రంగనాథన్ తో ఒక మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కీర్తీ శ్వరన్ డైరెక్ట్ చేయనున్నాడు.
రెండో తమిళ మూవీ…
ఈ బ్యానర్ లో ఇది రెండో తమిళ్ మూవీ అవుతుంది. మొదటిది అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ని నిర్మించారు. వచ్చే నెలలో ఈ మూవీ విడుదల కానుంది. ఇవే కాక ఇంకా కొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మించే ఈ కాంబో లు చూస్తే మతి పోతుందని సినీ లవర్స్ అనుకుంటున్నారు. మరో 10 ఏళ్లు ఈ బ్యానర్ కి తిరుగులేదని కాంబో లు చూస్తేనే అర్థమవుతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








