April Fools Day : ఏప్రిల్ 1 అనగానే అందరికీ ప్రాంక్స్ (prank), సరదా మోసాలు, నవ్వుల సందడి గుర్తుకొస్తాయి. ఈ రోజు చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ ఎవరో ఒకరిని సరదాగా మోసపెట్టడానికి ప్లాన్ వేసుకుంటారు. అయితే.. ఈ ఏప్రిల్ ఫూల్స్ డే చరిత్ర (April Fools Day HISTORY) ఏమిటి? ఇదెందుకు అంతగా ప్రాచుర్యం పొందింది.. దీని వెనుక ఉన్న నేపథ్యం ఏమిటి? తెలుసుకుందాం.
April Fools Day అసలు ఎలా వచ్చిందంటే..
ఒకప్పటి ఫ్రాన్స్‌లో జనవరి 1 స్థానంలో ఏప్రిల్ 1ను నూతన సంవత్సరంగా జరుపుకునే సంప్రదాయం ఉండేది. కానీ, 1582లో పోప్ గ్రెగొరీ (Pope Gregory) XIII జనవరి 1ను నూతన సంవత్సరంగా ప్రకటించారు. అయితే, పాత సంప్రదాయాన్ని అనుసరిస్తూనే ఉన్న వారిని “ఏప్రిల్ ఫూల్స్” అని పిలుస్తూ సరదాగా మోసపెట్టడం మొదలైంది. భారతదేశంలో హోలీ పండుగ, ఏప్రిల్ ఫూల్స్ డే మధ్య కొంత సామీప్యత ఉంది. భారతదేశంలో హోలీ పండుగలో కూడా సరదాగా రంగులు చల్లుకోవడం, స్నేహితులను మోసపెట్టడం చేస్తుంటాం. అలాగే రోమన్లు మార్చి 25న ఫూల్స్‌డేను జరుపుకొనే వారు. “హిలారియా” పండుగ సందర్భంగా ఆ రోజు వారు వేషాలు మార్చుకొని, సరదాగా ఒకరినొకరు మోసపెట్టుకునేవారు.
ప్రపంచ వ్యాప్తంగా టాప్ April Fools Day మోసాలు
- 1957లో BBC ఓ డాక్యుమెంటరీలో స్విట్జర్లాండ్ రైతులు చెట్ల మీద పాస్తా పండిస్తున్నట్లు చూపించారు. చాలా మంది ఈ వీడియోను నమ్మారు!
- పెన్సిల్వేనియాలోని The Progress పత్రిక 1950లో నిజమైన UFO ఫోటో! అని ప్రచురించింది. ప్రజలు దీనిని నమ్మి భయంతో పరుగులు తీశారు.
- 2008లో BBC ఓ వీడియోలో పెంగ్విన్లు గాల్లో ఎగురుతున్నట్లు చూపించింది. ప్రజలు నిజమేనని నమ్మారు.
- 1998లో బర్గర్ కింగ్ “ఎడమచేతి వాటం గల వ్యక్తుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన బర్గర్ అని ప్రకటించింది. వేలాది మంది దుకాణానికి వెళ్లి ఆ బర్గర్ కోసం అడిగారు. అలాంటిదేమీ లేదని తెలుసుకొని సరదాగా నవ్వుకున్నారు.
- 1976లో శాస్త్రవేత్త సర్ ప్యాట్రిక్ మూర్ ఏప్రిల్ 1న భూమి తక్కువ గ్రావిటీతో తేలిపోతుంది అని చెప్పారు. చాలామంది తమ శరీరాలు తేలిపోతున్నాయన్న ఫీలింగ్ వచ్చిందని రిపోర్ట్ చేశారు! అదంతా ఏప్రిల్ ఫూల్ కోసం సరదాగా చేసిన ప్రకటన అని తెలుసుకొని నవ్వుకున్నారు.
సరదాలు బాధపట్టేలా ఉండొద్దు
ఏప్రిల్ ఫూల్స్‌డే సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులను సరదాగా మోసపెట్టండి. కానీ అది వారిని బాధపెట్టేలా కాకుండా కేవలం సరదా కోసం అయ్యుండాలి. ఏప్రిల్ ఫూల్స్‌డే సందర్భంగా
ఫన్నీ మీమ్స్ లేదా వీడియోలు షేర్ చేయడం ద్వారా ఈ రోజును ఆసక్తికరంగా మార్చుకోవచ్చు.
సోషల్ మీడియాలో మీ అనుభవాలను షేర్ చేయండి. #AprilFoolsDay హ్యాష్‌ట్యాగ్‌తో మీ ఫన్నీ అనుభవాలను షేర్ చేయండి. అయితే.. ఎవరైనా అసలైన సమస్య ఎదుర్కొంటున్నప్పుడు వారికి హేళన చేయకూడదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..