Sarkar Live

Kancha Gachibowli : కంచ గచ్చిబౌలి భూ వివాదం.. సుప్రీం కీలక ఉత్తర్వులు

Kancha Gachibowli :హైద‌రాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం (Kancha Gachibowli land dispute) అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా దీనిపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు (Supreme Court orders) జారీ చేసింది. ఆ భూముల పరిస్థితిపై నివేదికను వెంట‌నే

Supreme Court

Kancha Gachibowli :హైద‌రాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం (Kancha Gachibowli land dispute) అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా దీనిపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు (Supreme Court orders) జారీ చేసింది. ఆ భూముల పరిస్థితిపై నివేదికను వెంట‌నే సమర్పించాల‌ని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను ఈ రోజు ఆదేశించింది. అలాగే తుది తీర్పు వచ్చేంత వరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరపకూడదని, చెట్లు నరకకూడదని ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Kancha Gachibowli : పిటిష‌న్ దాఖ‌లు

కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం అకస్మాత్తుగా చేపడుతున్న చర్యలు వన్యప్రాణాలకు హాని కలిగించేలా ఉన్నాయని ప‌లువురు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. పర్యావరణానికి నష్టం కలిగించేలా ప్ర‌భుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని పిటిషన్ దాఖ‌లు చేశారు. భూమిని సమతలీకరించేందుకు ముందుగా నిపుణుల కమిటీని నియమించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, ఆ ప్రక్రియ ఏమీ లేకుండానే ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని పేర్కొన్నారు.

హైకోర్టు నివేదిక త‌ర్వాత సుప్రీం విచార‌ణ‌

ఈ వ్యవహారంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన సుప్రీం కోర్టు.. హైకోర్టులో జరుగుతున్న విచారణను కొనసాగించాల్సిందేనని, అందువల్ల తాము ఎటువంటి స్టే ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. అయితే, హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక అందించిన తర్వాత మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది.

Kancha Gachibowli : హెచ్‌సీయూ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వద్ద పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అక్కడ విద్యార్థి సంఘాలు భూముల వ్యవహారంపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులు (HCU students) నిర‌స‌న‌కారులు యూనివర్సిటీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదం రాష్ట్ర రాజధానిలో మరింత రాజకీయ ఉత్కంఠకు దారితీస్తోంది. విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి యత్నించగా (HCU student protests) పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ప్ర‌భుత్వ స్పంద‌న‌పై ఉత్కంఠ‌

తం ఈ వివాదం మరింత తీవ్రమవుతోంది. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక (Telangana High Court report) సమర్పించిన తర్వాత వచ్చే తీర్పును ఆధారంగా చేసుకొని, భవిష్యత్‌లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు (Government response on land issue) తీసుకుంటుందోన‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్రా నెల‌కొంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!