Sarkar Live

Stock market | వణికించిన ట్రేడ్ వార్.. భారత స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

Stock market : వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. దీనికి ప్రభావంగా భారత స్టాక్ మార్కెట్ (Stock market) కూడా సోమవారం ఒక్కరోజే చరిత్రలోనే అరుదైన స్థాయిలో పడిపోయింది. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) సెన్సెక్స్ (Sensex),

Stock market

Stock market : వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. దీనికి ప్రభావంగా భారత స్టాక్ మార్కెట్ (Stock market) కూడా సోమవారం ఒక్కరోజే చరిత్రలోనే అరుదైన స్థాయిలో పడిపోయింది. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) సెన్సెక్స్ (Sensex), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) నిఫ్టీ (Nifty).. రెండూ 5 శాతం కంటే ఎక్కువ పతనమయ్యాయి. చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump’s tariff)టారిఫ్‌లు పెంచిన విషయానికి ప్రతిగా చైనా కూడా రివెంజ్ టారిఫ్‌లు విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో భయం చెలరేగింది.

ఒకరోజే 3,939 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్

BSE సెన్సెక్స్ 30 షేర్ల సూచీ సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే 3,939 పాయింట్లు (-5.22%) పడిపోయి 71,425.01 వద్దకు చేరింది. అదే సమయంలో NSE నిఫ్టీ 1,160 పాయింట్లు (-5.06%) పడిపోయి 21,743.65కి చేరింది. మధ్యాహ్నం వరకూ మార్కెట్‌లో అమ్మకాల ఊపు కొనసాగింది. అప్పటికీ సెన్సెక్స్ 3,205 పాయింట్లు (-4.25%) తక్కువగా 72,159.38 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 1,038 పాయింట్లు (-4.54%) తక్కువగా 21,865.50 వద్ద ట్రేడవుతోంది.

Stock market : ఏ కంపెనీ షేర్లు ఎలా ఉన్నాయి?

అన్ని BSE సూచీ సంస్థల షేర్లు నెగెటివ్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా టాటా స్టీల్ షేరు 9 శాతం పతనమైంది. టాటా మోటార్స్ 8 శాతం పడిపోయింది. లార్సెన్ & టూబ్రో, హెచ్ఎస్ఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్ షేర్లు కూడా భారీగా నష్టపోయాయి.

ఆసియా మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంది?

వాణిజ్య యుద్ధ భయం ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్న నేప‌థ్యంలో హాంకాంగ్ (Hong Kong)లో హాంగ్‌సేంగ్ (Hang Seng) సూచీ 12 శాతం క్షీణించింది. టోక్యోలో నిక్కీ 225 సూచీ 8 శాతం పడిపోయింది. చైనా షాంఘై ఎస్‌ఎస్‌ఈ సూచీ 8 శాతం పడిపోయింది. దక్షిణ కొరియాలో కోస్పీ సూచీ 5 శాతం నష్టపోయింది.

అమెరికా మార్కెట్లు కూడా..

అమెరికా స్టాక్ మార్కెట్లు శుక్రవారం రోజే తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. S&P 500 సూచీ 5.97 శాతం పడిపోయింది. నాస్‌డాక్ 5.82 శాతం, డౌ జోన్స్ 5.50 శాతం పతనమయ్యాయి. డౌ జోన్స్ 2,000 పాయింట్ల కంటే ఎక్కువగా పడిపోయింది.

Stock market : భవిష్యత్తులో ఏమి జరుగుతుంది?

రిలయన్స్ సెక్యూరిటీస్‌కు చెందిన హెడ్ ఆఫ్ రీసెర్చ్ వికాస్ జైన్ మాట్లాడుతూ ‘‘చైనా, జపాన్ మార్కెట్లు వరుసగా 10 శాతం, 8 శాతం నష్టపోవడం ఈ వాణిజ్య యుద్ధానికి తీవ్రతను తెలియజేస్తోంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా రిసెషన్ భయం పెరుగుతోంది. చైనా ఏప్రిల్ 10 నుంచి అమెరికా దిగుమతులపై 34 శాతం టారిఫ్‌లు విధించనుంది. అమెరికా కూడా అదే స్థాయిలో టారిఫ్‌లను పెంచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరగడానికి, ఆర్థిక వృద్ధి మందగించడానికి దారితీయొచ్చు’’ అని తెలిపారు.

చిన్న మిడ్ క్యాప్ షేర్లు కూడా నష్టాల్లోకి..

BSE స్మాల్ కాప్ సూచీ 5.78 శాతం పడిపోయింది. మిడ్ క్యాప్ సూచీ 4.52 శాతం నష్టపోయింది. అన్ని BSE రంగాల సూచీలు నెగెటివ్‌లోనే ఉన్నాయి. మెటల్ రంగం 7 శాతం, కమోడిటీస్ 5.84 శాతం, ఇండస్ట్రియల్స్ 5.73 శాతం, ఐటీ రంగం 5.01 శాతం, కన్స్యూమర్ డిస్క్రిషనరీ 4.94 శాతం, టెక్ రంగం 4.37 శాతం పతనమయ్యాయి.
ఫారిన్ ఇన్వెస్టర్లు (FIIs) పెద్ద ఎత్తున షేర్లను విక్రయించారు. శుక్రవారం ఒక్క రోజే రూ.3,483.98 కోట్ల విలువైన షేర్లను విక్రయించారని NSE సమాచారం. చమురు ధరలు తగ్గినప్పటికీ మార్కెట్‌ను నిలబెట్టలేకపోయాయి. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 2.94 శాతం తగ్గి డాలర్ 63.51కి చేరింది. ఇది మార్కెట్‌ను బలపర్చాలనుకున్నా పెట్టుబడిదారుల భయం తగ్గించలేకపోయింది.

గత వారం ఎలా సాగింది?

గత వారం మొత్తం చూసుకుంటే, సెన్సెక్స్ 2,050 పాయింట్లు (-2.64%) పడిపోయింది. నిఫ్టీ 614 పాయింట్లు (-2.61%) పడిపోయింది. అయితే ఈ వారంలో సోమవారం ఒక్కరోజే మార్కెట్‌కి పెద్ద షాక్ తగిలింది.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?