Sarkar Live

Akkineni Akhil | లెనిన్ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది

Akkineni Akhil | సిసింద్రీ మూవీతో తెరపైకి వచ్చి ఫ్యూచర్ స్టార్ అనిపించుకున్న హీరో అక్కినేని అఖిల్ (Akkineni Akhil). అక్కినేని అభిమానులంతా అయ్యగారు అని ముద్దుగా పిలుచుకునే ఈ హీరో పదేళ్లుగా హిట్టు కోసం సతమతం అవుతూనే ఉన్నాడు. అక్కినేని

Akkineni Akhil

Akkineni Akhil | సిసింద్రీ మూవీతో తెరపైకి వచ్చి ఫ్యూచర్ స్టార్ అనిపించుకున్న హీరో అక్కినేని అఖిల్ (Akkineni Akhil). అక్కినేని అభిమానులంతా అయ్యగారు అని ముద్దుగా పిలుచుకునే ఈ హీరో పదేళ్లుగా హిట్టు కోసం సతమతం అవుతూనే ఉన్నాడు. అక్కినేని ఫ్యామిలీకి మెమొరబుల్ మూవీ మనం(Manam)సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో కనిపించి సూపర్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు.

అఖిల్ మొదటి సినిమాని మాస్ పల్స్ తెలిసిన వివి వినాయక్ డైరెక్షన్లో అఖిల్ (Akhil movie) సినిమా తో హీరోగా పరిచయం అయ్యాడు. తన బాడీ లాంగ్వేజ్ కి స్టోరీ మ్యాచ్ కాకపోవడంతో ఆ క్యారెక్టర్ బరువును మోయలేక సినిమా దెబ్బతింది. ఆ తర్వాత డిఫరెంట్ స్టోరీ లను తీసే విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో హలో (Hello) మూవీని చేశాడు.ఆ మూవీ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. లవ్ స్టోరీస్ ని బాగా తీసే డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(most eligible bachelor) మూవీ అఖిల్ కు కాస్త ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. యావరేజ్ అనిపించుకున్న ఈ మూవీ నటనలో మాత్రం అఖిల్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమాతో అఖిల్ కెరీర్ టర్నింగ్ అవుతుందని తీసిన మూవీ ఏజెంట్. భారీ అంచనాలతో హై ఎక్స్పెక్టేషన్స్ తో సురేందర్ రెడ్డి లాంటి డైరెక్టర్ సినిమా తీస్తుండడంతో అక్కినేని అభిమానులంతా ఈసారి అఖిల్ కు హిట్ గ్యారెంటీ అనుకున్నారు. కానీ తన కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా ఈ మూవీ నిలిచిపోయింది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ…

అప్పటినుండి ఏదైనా డిఫరెంట్ గా తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకోవాలని డిసైడ్ అయిపోయాడు. చాలా స్టోరీస్ విని మురళి కిషోర్ అబ్బూరి (Murali Kishore Abburi) డైరెక్షన్ లో లెనిన్(Lenin)అనే మూవీని తీశాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ టీజర్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. టీజర్ చూస్తుంటే రఫ్ లుక్ లో అఖిల్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే మూవీస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ఎలాంటి హిట్టు వస్తుందో మనకు తెలుసు. చాలా మంది హీరోలు ఇలాంటి స్టోరీ లతో నే భారీ హిట్లు కొడుతున్నారు. వరుస ఫ్లాఫ్ లో ఉన్న అఖిల్ కి ఈ మూవీ బ్రేక్ ఇస్తుందనిపిస్తుంది.

Akkineni Akhil : రాయలసీమ యాసలో సూపర్ డైలాగ్స్..

రాయలసీమ యాసలో తను చెప్పిన డైలాగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఫ్యాన్స్ మాత్రం అయ్యగారి మూవీ ఈసారి అదిరిపోయేలా ఉండబోతుందని ఖుషీ అవుతున్నారు. టీజర్ లో తమన్ ఇచ్చిన బీజీఎం కు కూడా ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తమన్ (Taman) మ్యూజిక్ తో మూవీ మరో లెవెల్ కి వెళ్తుందని ఫాన్స్ అనుకుంటున్నారు. అన్నపూర్ణ స్టూడియో, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ (Akkineni Nagarjuna and Surya Devara Nagavanshi) కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!