Teacher Beats Students : ముగ్గురు చిన్నారులపై ఓ టీచర్ (School teacher) తన దాష్టీకాన్ని ప్రదర్శించింది. హోం వర్క్ చేయలేదని (not doing homework) చెప్పుతో చితకబాదింది. ఈ దారుణం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని శ్రీ సత్యసాయి జిల్లా (Satya Sai district) ధర్మవరంలో ఓ ప్రైవేటు స్కూల్‌లో చోటుచేసుకుంది. దీనిపై ఆ చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
Teacher beats students : స్కూల్ వద్ద ఉద్రిక్తత
ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్లిన రెండో తరగతి విద్యార్థులను టీచర్ అనిత (Teacher Anitha) హోం వర్క్ చేశారా? అని అడిగింది. వీరిలో ముగ్గురు విద్యార్థులు చేయలేదని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది. తన కాలి చెప్పుతో ఆ చిన్నారులను విచక్షణారహితంగా కొన్ని నిమిషాలపాటు కొట్టింది. దీంతో ఆ పిల్లల శరీరం కందిపోయింది. ఈ ఘటన (Homework punishment) వెలుగులోకి వచ్చాక బాధిత విద్యార్థుల తల్లిదండ్రులే కాకుండా ఇతర స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా పెద్ద సంఖ్యలో పాఠశాల ఆవరణలో చేరారు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా ఇంత దారుణంగా ఎందుకు కొట్టావని టీచర్ అనితను నిలదీశారు. కొందరు మహిళలు ఆమెపై దాడికి యత్నించారు. పాఠశాల యాజమాన్యం పరిస్థితిని శాంతింపజేయాలనే ప్రయత్నం చేసినా ఆందోళనకారుల ఆగ్రహాన్ని అదుపు చేయడం వీలుకాలేదు.
పోలీసులకు ఫిర్యాదు
పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసిన నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తమ పిల్లలను దారుణంగా కొట్టిన టీచర్ (Teacher Anitha)పై చర్య తీసుకోవాలని ఆ చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులకు ఈ సందర్భంగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మండల విద్యా అధికారి గోపాల్ నాయక్ స్పందిస్తూ దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








