Sarkar Live

SC subcategorisation | ఎస్సీల్లో ఉపవ‌ర్గాల వారీగా విభ‌జ‌నకు శ్రీకారం..

SC subcategorisation : తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారి రాష్ట్రంగా ఎస్సీ (షెడ్యూల్డ్ కాస్ట్) వర్గాల్ని ఉపవర్గాలుగా (subcategorisation ) విభజించి, వెనుకబాటును బట్టి రిజర్వేషన్లు (Rationalization of Reservations) కల్పించే చట్టాన్ని

SC subcategorisation

SC subcategorisation : తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారి రాష్ట్రంగా ఎస్సీ (షెడ్యూల్డ్ కాస్ట్) వర్గాల్ని ఉపవర్గాలుగా (subcategorisation ) విభజించి, వెనుకబాటును బట్టి రిజర్వేషన్లు (Rationalization of Reservations) కల్పించే చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇది ఏ ఇతర రాష్ట్రం చేయలేని గొప్ప ప్రయోగం. సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు, తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly), గవర్నర్ ఆమోదం అనంత‌రం అమ‌ల్లోకి తెచ్చింది. ఈ మేర‌కు అంబేద్క‌ర్ (BR Ambedkar) జ‌యంతి సంద‌ర్భంగా ఈ మేర‌కు ఇవాళా ఉత్తర్వులు (GO) విడుదల చేసింది.

చ‌ట్టం అమ‌లుకు స‌ర్కారు అడుగులు

సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న ఎస్సీ ఉప కులాల వారీగా రిజ‌ర్వేష‌న్ల‌పై తీర్పు చెప్పింది. అత్యంత వెనుకబడిన ఎస్సీ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ (Reservations) ఇవ్వొచ్చు అని పేర్కొంది. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం రిటైర్డ్ జ‌స్టిస్ ష‌మీమ్ అఖ్త‌ర్ (retired Justice Shameem Akhter) నేతృత్వంలో 2024 అక్టోబరులో కమిషన్‌ను నియ‌మించింది. అనంత‌రం 2025 2025 మార్చి 18న‌ అసెంబ్లీ (Telangana Assembly)లో ఈ చట్టం ఆమోదం పొందింది. 2025 ఏప్రిల్ 8న గవర్నర్ ఈ చ‌ట్టంపై ఆమోద ముద్ర‌పడింది. ఈ క్ర‌మంలో అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు (2025 ఏప్రిల్ 14న) ఈ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చింది.

SC subcategorisation : ఎస్సీ ఉపవర్గీకరణ అంటే ఏమిటి?

తెలంగాణలో ఇప్పటి వరకు ఎస్సీ వర్గాలన్నీ ఒక్కటిగా 15 శాతం రిజర్వేషన్ పొందుతున్నాయి. కానీ ఇందులో కొన్ని కులాలు చాలా పురోగతిలో ఉన్నాయి, మరికొన్ని చాలా వెనుకబడ్డవిగా ఉన్నాయి. దీంతో వెనుకబడిన ఎస్సీ కులాలకు మరింత ప్రాధాన్యత, అభివృద్ధి అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించి, అవెంత వెనుక ఉన్నాయో దాన్నిబట్టి రిజర్వేషన్ శాతం కేటాయించింది.

గ్రూపుల వారీగా విభజన ఇలా..

  • గ్రూప్ 1 – అత్యంత వెనుకబడినవారు: మొత్తం 15 కులాలు
    జనాభా: 1,71,625 మంది (మొత్తం ఎస్సీ జనాభాలో 3.288%)
    రిజర్వేషన్: 1%
    వీరికి జనాభా ప్రకారం 0.5% మాత్రమే రావాలి. కానీ వీరి అత్యంత వెనుకబాటుతనాన్ని పరిగణించి అదనంగా 0.5% ఇచ్చారు.
  • గ్రూప్ 2 – కొంతవరకు లాభపడిన వర్గాలు: మొత్తం 18 కులాలు
    జనాభా: 34 లక్షల మంది (62.74%)
    రిజర్వేషన్: 9%
  • గ్రూప్ 3 – తక్కువగా వెనుకబడినవారు: మొత్తం 26 కులాలు
    జనాభా: 17 లక్షల మంది (33.963%)
    రిజర్వేషన్: 5%

కొన్ని కులాలకు ఇలా..

చదువు, ఉద్యోగావ‌కాశాలు తక్కువగా ఉన్నబుడిగ జంగం వారిని గ్రూప్ 1లో చేర్చారు. అలాగే రెల్లా సామాజిక వ‌ర్గం వారు కేటగిరీ A లో ఉండగా ఇప్పుడు గ్రూప్ 3లోకి మార్చారు. దీనిపై విమర్శలు వచ్చాయి.

ష‌మీమ్ అఖ్త‌ర్ కమిషన్ ఎలా పని చేసింది?

షమీమ్ అఖ్తర్ (Shameem Akhter) కమిషన్ పనిచేసిన విధానం నిజంగా విస్తృతమైనది. ప్రజలు, సంఘాలు, కుల ప్రతినిధుల నుంచి మొత్తం 8600కు పైగా అభిప్రాయాల‌ను స్వీకరించారు. జనాభా గణాంకాలు, విద్యా స్థాయిలు, ఉద్యోగాలు, ప్రభుత్వం ఇచ్చిన ఫైనాన్షియల్ సహాయాలు, రాజకీయ హక్కులపై జ‌రిగిన చ‌ర్చ‌లు, వెల్ల‌డైన అభిప్రాయాల‌ను క్రోడీక‌రించి ప్ర‌భుత్వానికి నివేదికను స‌మ‌ర్పించారు. ఆ తర్వాత కూడా కొన్ని వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కమిషన్ గడువు ఒక నెల పెంచి మరోసారి సమీక్షించింది.

SC subcategorisation : ప్రభుత్వ తుది నిర్ణయం

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ ఏప్రిల్ 13న చివరి సమావేశం నిర్వహించింది. క‌మిష‌న్ ఇచ్చిన నివేదిక‌ను స‌మీక్షించింది. క్రీమీ లేయర్ (ధనవంతులను తొలగించే విధానం) సిఫార్సును ప్రభుత్వం తిరస్కరించింది. ఎస్సీలకు ప్రస్తుతం ఉన్న ప్రయోజనాలపై ఎటువంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. 2026 జనాభా లెక్కల తర్వాత రిజర్వేషన్ శాతం పెంపుని పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.

చట్టం అమలైతే కలిగే ప్ర‌యోజ‌నాలు

  • అసలు నిజంగా వెనుకబడిన కులాలకు అవకాశాలు
  • సామాజిక న్యాయం సాధనకు పెద్ద అడుగు
  • అనవసరంగా లాభపడుతున్న కులాలకు కొంత తగ్గింపు
  • రాష్ట్రం నూతన మోడల్‌గా దేశానికి మార్గదర్శకం

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?