Sarkar Live

Murugadoss : మురుగదాస్ రిస్క్ చేస్తున్నాడా…?

Tollywood News | ఒకప్పుడు మురుగదాస్ (Murugadoss)నుండి సినిమా వస్తుందంటే సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఆ రేంజ్ లో మురుగదాస్ టేకింగ్ ఉండేది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా బడా హీరోలు తను కథ చెబితే

Murugadoss

Tollywood News | ఒకప్పుడు మురుగదాస్ (Murugadoss)నుండి సినిమా వస్తుందంటే సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఆ రేంజ్ లో మురుగదాస్ టేకింగ్ ఉండేది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా బడా హీరోలు తను కథ చెబితే చాలు డేట్స్ ఇచ్చేవారు. అలాంటి డైరెక్టర్ కొద్ది కాలంగా వరుస ఫ్లాఫ్ లతో ఇబ్బంది పడుతున్నాడు.

రమణ (Ramana) మూవీని విజయ్ కాంత్ తో తీసి బంపర్ హిట్టు కొట్టాడు. ఆ మూవీని తెలుగులో వీవీ వినాయక్ డైరెక్షన్లో ఠాగూర్ (Tagur) తీసి సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మురుగదాస్ డైరెక్షన్లో సూర్య (Surya)హీరోగా గజిని, హిందీలో అమీర్ ఖాన్ గజినీ (Ameer Khan gajini), సెవెన్త్ సెన్స్,కత్తి ,తుపాకీ ఇలాంటి మూవీస్ తో తను ఎంత పొటెన్షియల్ ఉన్న డైరెక్టరో ఆడియన్స్ కి చూపెట్టాడు.

ఇంకా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మహేష్ బాబు స్పైడర్(Mahesh spider)మూవీ తన కెరీర్ ని ప్రమాదంలోకి నెట్టేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని అందుకోలేదు. అయినా మురుగదాస్ అవకాశాలు ఏమి తగ్గలేదు. తర్వాత కూడా స్టార్స్ తో మూవీస్ ని తీసాడు. రజినీకాంత్ తో ధర్బార్, విజయ్ తో సర్కార్ మూవీస్ తీసినా కూడా హిట్టు ట్రాక్ ని ఎక్కలేదు.

Murugadoss : శివకార్తికేయన్ తో మదరాసి

చాలా గ్యాప్ తర్వాత శివ కార్తికేయన్ తో మదరాసి(Madrasi),సల్మాన్ ఖాన్ తో సికిందర్ (Salman Khan sikidhar) మూవీస్ ని ఏకకాలంలో తెరకెక్కించాడు. ఇందులో మొదట సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన సికిందర్ మూవీని రిలీజ్ చేశారు. సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టు అవుతుందనుకున్నా సికిందర్ మూవీ సల్మాన్ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. రొటీన్ స్టోరీ తో ఒక సౌత్ సినిమాని నార్త్లో ప్రజెంట్ చేయడం, అందులోనూ ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఎలెమెంట్స్ లేకపోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో మురగదాస్ కెరీర్ ప్రమాదంలోకి వెళ్ళింది.

సెప్టెంబర్ 5న రిలీజ్…

ఇక మంచి ఫామ్ లో ఉన్న శివ కార్తికేయన్ తో తీయబోయే మూవీ పై పాజిటివ్ టాక్ ఉండడంతో మురుగదాస్ (Murugadoss) దీనిపైనే భారీ ఆశలతో ఉన్నాడు. ఒకవైపు సికిందర్ మూవీతో భారీ నెగెటివిటీని మూట కట్టుకున్న మురుగదాస్ ఆ నెగెటివిటీ ఇంకా తగ్గకముందే మదరాసి మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించేశారు. సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్నట్లు మేకర్ ప్రకటించారు. ఇక ఈ మూవీ తోనైనా మురుగదాస్ బౌన్స్ బ్యాక్ అవుతారని సినీ లవర్స్ ఆశిస్తున్నారు. ఒక మంచి పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ ఫ్లాఫ్ లు తీస్తుంటే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అమరన్ మూవీతో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న శివకార్తికేయన్ తో తీసే మదరాసి మూవీతోనైనా భారీ హిట్టు కొట్టి మళ్లీ మురుగదాస్ హిట్టు ట్రాక్ ఎక్కాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!