Drishyam 3 Movie Release Date | మలయాళంలో మోహన్ లాల్ (Mohan lal) హీరోగా జీతూ జోసెఫ్ (Jeethu joseph) డైరెక్షన్ లో తెరకెక్కిన దృశ్యం, దృశ్యం 2 (Drishyam , Drishyam 2) సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నాయి. మలయాళం లో సూపర్ హిట్ అయిన ఈ మూవీస్ ని హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో కూడా తీసి సూపర్ హిట్స్ అందుకున్నారు. తెలుగులో దృశ్యం సినిమాను శ్రీ ప్రియ డైరెక్షన్లో వెంకటేష్ (Venkatesh) హీరోగా తెరకెక్కించారు.
మాతృకలో ఎంతటి ఘన విజయాన్ని అంతకుందో తెలుగులో కూడా అంతే హిట్టు అయ్యి వెంకటేష్ కెరీర్ లో మంచి సినిమాగా నిలిచిపోయింది. భారీ అంచనాలతో వచ్చిన దృశ్యం 2 మూవీ కూడా ఎవరు ఊహించని విధంగా ట్విస్ట్ లు ఉండడంతో ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
Drishyam 3 అన్ని భాషల్లోనూ రిలీజ్..?
ఇక హిందీలో అజయ్ దేవగన్ (Ajay Devgan) హీరోగా నటించగా అక్కడ కూడా సూపర్ హిట్టు అయింది. వేర్వేరు భాషల్లో వేరు వేరు హీరోలతో తెరకెక్కిన ఈ మూవీని వారి ఫ్యాన్స్ ఆ హీరోలను తప్ప ఆ పాత్రలో వేరే వారిని ఊహించుకోలేని పరిస్థితి నెలకొంది. అన్ని భాషల్లోనూ అదే తీరుగా హిట్ అవడం,ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకుంది. ఇప్పుడు దృశ్యం 3 మూవీని చిత్రబృందం అన్ని భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొని రావాలని అనుకున్నారట.
జీతూనే డైరెక్ట్ చేయాలి..
ఈ మూవీ ప్రొడ్యూసర్ రీసెంట్ గా చెప్పిన ప్రకారం మోహన్ లాల్ తో తెరకెక్కించి అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. స్వయంగా మూవీ ప్రొడ్యూసర్ చెప్పడంతో ఇప్పుడు ఈ మూవీ చర్చనీయాంశమైంది. అయితే ఈ నిర్ణయంపై కొందరు ఫ్యాన్స్ అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగులో అయితే వెంకటేష్ హీరోగా నటిస్తేనే బాగుంటుందని సినీ లవర్స్ అభిప్రాయ పడుతున్నారు. తెలుగులో దృశ్యం 2 మూవీని స్వయంగా జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేయడం విశేషం. మోహన్ లాల్ అద్భుతమైన నటుడే కానీ తెలుగు దృశ్యం మూవీలలో వెంకటేష్ యాక్టింగ్ తో ఆ పాత్రకు జీవం పోశారు. ఇప్పుడు మోహన్ లాల్ ను తెలుగులో ఊహించుకోవడం కష్టంతో కోరుకున్న పనే అని అంటున్నారు. హిందీలోనైతే ఇప్పటికీ దృశ్యం3 (Drishyam 3) మూవీని వేరే వెర్షన్ లో తెరకెక్కించాలని ప్లాన్ కూడా చేస్తున్నారట. మరి తెలుగులో జీతూ జోసెఫ్ స్వయంగా రంగంలోకి దిగి వెంకటేష్ తో తిరకెక్కిస్తారా.. లేదా హిందీలో లాగా వేరే వెర్షన్ రెడీ చేసుకుని ప్రొసీడ్ అవుతారా అనేది వేచి చూడాలి. తెలుగు ఆడియన్స్ అయితే జీతూ జోసెఫ్ తెలుగులో కూడా డైరెక్షన్ చేస్తే ఇంకా బాగుంటుందని అంటున్నారు. మోహన్ లాల్ దృశ్యం 3 తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా..లేకపోతే వెంకటేష్ హీరోగా వస్తుందా అనే దానిపై మూవీ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.