Regularization : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (Telangana Grameena Bank)లో 20 ఏళ్లుగా రోజువారీ వేతనంపై పని చేస్తున్న(working on daily wages) 456 మంది తాత్కాలిక ఉద్యోగుల న్యాయపోరాటం ఫలించింది. ఎన్నో సంవత్సరాలుగా రెగ్యులర్ ఉద్యోగుల్లా పని చేస్తున్నప్పటికీ ఎలాంటి స్థిర ఉద్యోగ హోదా లేకుండా తక్కువ వేతనాలతో ప్రయోజనాలు లేకుండా కొనసాగిస్తూ వచ్చిన యాజమాన్యానికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గట్టి షాక్ ఇచ్చింది. వీరి సర్వీసులను క్రమబద్ధీకరించాలని (regularisation) జస్టిస్ పుల్ల కార్తీక్ ఇచ్చారు.
Regularization నిరాకరణను సవాల్ చేస్తూ..
బ్యాంకు (Telangana Grameena Bank)లో పనిచేస్తున్న స్వీపర్లు, మెసెంజర్లు సహా ఇతర ఉద్యోగులు ఏళ్లతరబడి తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వీరిని గత రెండు దశాబ్దాలుగా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా బ్యాంక్ యాజమాన్యం కొనసాగిస్తోంది. కొత్తగా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, గతంలోనే చేరిన తాత్కాలిక ఉద్యోగులను యథావిధిగా వాడుకుంటూ వస్తున్నారని పిటిషనర్లు కోర్టులో వాదించారు. యాజమాన్యం నిర్లక్ష్య విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ గ్రామీణా బ్యాంక్ తాత్కాలిక ఉద్యోగుల సంఘం (Temporary Employees Association) తరపున బాధిత ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. బ్యాంకు గతంలో రెగ్యులరైజేషన్‌ను నిరాకరించిన తీర్మానాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు.
ఇప్పటికైనా క్రమబద్ధీకరించండి : హైకోర్టు
పిటిషనర్ల వాదనలన్నింటినీ శ్రద్ధగా పరిశీలించిన హైకోర్టు ఈ నిర్ణయాన్ని తిరస్కరించింది. మీరు ఈ ఉద్యోగుల సేవలను ఏటా వాడుకుంటూ రెగ్యులర్ ఉద్యోగ (regular employment) హోదా లేకుండా ఉంచడం అన్యాయమని, ఇప్పటికైనా వారి పనితీరు ఆధారంగా వారిని రెగ్యులరైజ్ చేయాల్సిన సమయం వచ్చిందని బ్యాంకు యాజమాన్యాన్ని ఆదేశించింది.
తాత్కాలిక ఉద్యోగుల్లో హర్షం
ఈ తీర్పుతో బ్యాంకులో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు ఎదురుచూసిన తమ శ్రమకు గుర్తింపు దక్కబోతోందన్న నమ్మకం వారిలో పెరిగింది. ఈ తీర్పు ఒక బ్యాంకుకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రంలోనే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వేలాది మంది తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఒక న్యాయ మార్గం చూపించేలా ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








