Sarkar Live

India Pakistan Tension : కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లో విద్యుత్ సరఫరా.. ఎల్‌ఓసిపై అలర్ట్

India Pakistan Tension | భారతదేశం-పాక్ ప్రతిష్టంభన : పాకిస్తాన్ దాడుల‌తో భార‌త్ అల‌ర్ట్ అయింది. వెంట‌నే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీనితో పాటు సైరన్లు కూడా మోగడం ప్రారంభించింది.

India Pakistan Tension

India Pakistan Tension | భారతదేశం-పాక్ ప్రతిష్టంభన : పాకిస్తాన్ దాడుల‌తో భార‌త్ అల‌ర్ట్ అయింది. వెంట‌నే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీనితో పాటు సైరన్లు కూడా మోగడం ప్రారంభించింది. ఈ సమయంలో ప్రజలు ఇళ్ల‌ లోపలే ఉండి అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారత్‌ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత సమయంలో, గురువారం ఉదయం, పాకిస్తాన్ నుంచి వస్తున్న అనేక రాకెట్లను భారత్ ధ్వంసం చేసింది . పాకిస్తాన్ భారత్ లోని 15 నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించింది. కానీ భారత సైన్యం అన్నింటిని భగ్నం చేసింది.

మే 7-8 రాత్రి డ్రోన్లు, క్షిపణుల సహాయంతో పాకిస్తాన్ అనేక భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించిందని ఆర్మీ ఆఫీసర్ కల్నల్ ఖురేషి వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. అవంతిపురా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, అడంపూర్, బటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తర్‌లై, భుజ్ నగరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశాయి.అయితే, భారత్ యుఎఎస్ గ్రిడ్ బలమైన వైమానిక రక్షణ వ్యవస్థలు ఈ దాడులను పూర్తిగా తిప్పికొట్టాయి. వివిధ ప్రదేశాల నుండి స్వాధీనం చేసుకున్న శిథిలాలు ఈ దాడులు పాకిస్తాన్ భూభాగం నుండే జరిగాయని స్పష్టం చేస్తున్నాయి.

గురువారం భారత సాయుధ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయని, పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న వైమానిక రక్షణ రాడార్లు, వ్యవస్థలను విజయవంతంగా నాశ‌నం చేశాయ‌ని అధికారులు తెలిపారు. లాహోర్‌లో ఒక వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసమైనట్లు వెల్ల‌డించారు.

ఏ నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది?

  • శ్రీనగర్‌
  • వైష్ణో దేవి ఆలయం వద్ద
  • సాంబా
  • జైసల్మేర్‌
  • పఠాన్‌కోట్‌
  • అమృత్‌సర్‌
  • గురుదాస్‌పూర్‌
  • సాంబాలో బ్లాక్అవుట్
  • జలంధర్‌
  • బికనీర్‌

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?