Sarkar Live

Karthi : అమ్మో కార్తీ.. ఇన్ని సీక్వెల్సా…?

కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) కి తమిళంలో ఎంత మార్కెట్ ఉందో తెలుగులో కూడా అంతే మార్కెట్ సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా తనే డబ్బింగ్ చెప్పుకోవడంతో ఆడియన్స్ కి చాలా దగ్గర అయిపోయాడు. తన నుండి ఏ సినిమా రిలీజ్ అయిన

Karthi

కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) కి తమిళంలో ఎంత మార్కెట్ ఉందో తెలుగులో కూడా అంతే మార్కెట్ సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా తనే డబ్బింగ్ చెప్పుకోవడంతో ఆడియన్స్ కి చాలా దగ్గర అయిపోయాడు. తన నుండి ఏ సినిమా రిలీజ్ అయిన కూడా తెలుగులో కూడా అంతే బిగ్ రేంజ్ లో రిలీజ్ అయి హిట్స్ కొడుతుంటాడు. తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు.

తన నుండి వచ్చిన లాస్ట్ 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ (Premkumar)డైరెక్షన్లో సత్యం సుందరం (Sathyam sundaram)రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ప్రజెంట్ పిఎస్ మిత్రన్ (PS Mithran) డైరెక్షన్లో సర్దార్ (Sardar)మూవీని చేస్తున్నాడు. సర్దార్ ఫస్ట్ పార్ట్ లో కార్తీ విశ్వరూపాన్ని చూపించాడు.

తండ్రి,కొడుకుగా రెండు క్యారెక్టర్ లో కూడా అదరగొట్టేసాడు. స్పై,యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ కి బాగా నచ్చడంతో సీక్వెల్ చేస్తున్నారు. చాలా రోజుల కిందటే సెట్స్ మీదకి వెళ్ళిన సర్దార్ -2 (Sardar -2) సరికొత్త రికార్డులను తిరగరాస్తుందని కోలీవుడ్ టాక్. ఈ మూవీ తర్వాత ఎల్ వోయు లో భాగంగా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో ఖైదీ 2 (Khaidhi-2) మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

కెరీర్ సూపర్ హిట్ మూవీస్ సీక్వెల్స్…

ఖైదీ ఎంత భారీ హిట్ అయిందో తెలిసిందే. ఇక దీనికి సీక్వెల్ రానుండడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అలాగే హెచ్ వినోద్ (H Vinodh)డైరెక్షన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఖైదీ కి కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. దీంతో పాటు కార్తీ కెరీర్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ మూవీ యుగానికి ఒక్కడు (Yuganiki Okkadu) మూవీ సీక్వెల్ కూడా తొందర్లోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

హిట్ -4 లో కూడా…

దీంతోపాటు నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్లో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ హిట్ -4(Hit 4)లో కూడా కార్తి అదరగొట్టనున్నారు. ఇన్ని సీక్వెల్స్ చేసే హీరో ఒక కార్తీనే కావడం, అందులో అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ మూవీకి సీక్వెల్ కావడం, మళ్లీ ఆ పాత్రలో అభిమాన హీరోను చూడబోతుండడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఒక నాలుగు ఐదు ఏళ్ల వరకు కార్తీ ఈ సీక్వెల్స్ కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నాడట.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!